తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన రాజకీయ పక్షాలన్నీ అస్త్రశాస్త్రాలను సిద్ధం చేసుకున్నట్లుగా కనబడుతుంది.తెలంగాణలో టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బిజెపి అని ఇప్పటికే ప్రకటించుకున్న కమల సేన ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడానికి పావులు కదుపుతుంది ఇటీవల ఢిల్లీ పర్యటనలో అమిత్ షా తో భేటీ అయిన బండి సంజయ్ ఈ దిశగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.
కర్ణాటక ఎలక్షన్స్ ముగిసిన వెంటనే నేను పూర్తిస్థాయిలో తెలంగాణ నాయకులకు అందుబాటులో ఉంటానని అమిత్ షా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది …క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బిజెపి ప్రభుత్వం వస్తే జరిగే మంచిని వివరించి చెప్పి పార్టీలో వలసలు పెంచాలని అమిత్ షా వివరించినట్లు సమాచారం .అందువల్ల ఢిల్లీ నుంచి రాగానే బండి సంజయ్ మరో యాత్రకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది.

ఇప్పటికే ఐదు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి చేసుకున్న బండి సంజయ్ ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో తాత్కాలికంగా యాత్రకు విరామం ప్రకటించి ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన విషయం మనకు తెలిసింది అయితే రథయాత్రలు మళ్లీ ప్రారంభించాలని కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రజాసంఘమయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి రథయాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపేటట్లుగా రథయాత్ర షెడ్యూల్ను నిర్ణయించుకున్నారు.

ప్రతిరోజు ఒక నేత ఇంట్లో సమావేశం అవ్వాలని రథయాత్ర విజయవంతం అవ్వడానికి అవసరమైన ప్రణాళికను నిర్ణయించుకోవాలని పార్టీలోకి చేరికల్ని సాధ్యమైనంత ప్రోత్సహించాలని కేంద్ర పార్టీ నుంచి సూచనలు వచ్చినట్లుగా తెలుస్తోందిగత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో మూడవ స్థానం నుంచి రెండవ స్థానానికి ఎగబాకినట్లుగా కనిపిస్తున్న బిజెపి ఈసారి అధికారానికి గురి పెట్టింది మరి తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని పొంది అధికారానికి చేరువవుతుందో లేక కేసీఆర్ చాణక్యం ముందు మరొకసారి తేలిపోతుందో మరి కొద్ది నెలల్లో తేలనుంది.