శవానికి ట్రీట్​మెంట్.. బిల్లు రూ.16లక్షలు.. ప్రైవేట్ ఆస్పత్రి నిలువు దోపిడి..!

ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్న సామాన్యులకు వైద్యం అందని ద్రాక్ష పండులాగే ఉంది.ఒకపక్క ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక వసతులు, సరిగ్గా వైద్యం అందదానే భయం, మరొకపక్క ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే లక్షల బిల్లు వేసి దోచుకుంటారని భయంతో మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

 Treatment Of The Dead Body.. The Bill Is Rs. 16 Lakhs.. Vertical Robbery Of The-TeluguStop.com

అనారోగ్యం వస్తే అనవసరమైన రకరకాల టెస్టులు చేసి సామాన్య ప్రజలను దోచుకోవడం, ప్రైవేట్ ఆసుపత్రులకు అలవాటుగా మారింది.ఇప్పటివరకు మనం బ్రతికి ఉన్న వ్యక్తులకు వైద్యం చేసి లక్షలు కాజేసే ప్రైవేట్ ఆస్పత్రుల గురించి వినే ఉంటాం.వరంగల్ లోని హనుమకొండ సిగ్మా ఆస్పత్రిలోని వైద్యులు ఠాగూర్ సినిమా సీన్ ను రిపీట్ చేసి, శవానికి వైద్యం చేసి రూ.16 లక్షల బిల్లులు వసూలు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్లోని గాడిపెళ్లి గ్రామానికి చెందిన అఖిల ఇంటర్మీడియట్ చదువుతోంది.ఫిబ్రవరి 23న తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ అఖిల పురుగుల మందు తాగింది.

ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని సిగ్మా ఆస్పత్రికి తరలించారు.అఖిలను ఐసీయూలో ఉంచి, చూసేందుకు ఎవరిని అనుమతించకుండా వైద్యం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులను బంధువులను నమ్మించారు.

వివిధ రకాల పరీక్షలు చేస్తున్నామని, అఖిల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని 16 లక్షల బిల్లు వసూలు చేశారు.

పేషంట్ ను చూపించాలని గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు గట్టిగా నిలదీయడంతో అఖిల చనిపోయిందని వైద్యులు తెలిపారు.డబ్బు కోసం చనిపోయిన అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తున్నామని ఇంత దారుణంగా మోసం చేస్తారా అని కోపంతో బంధువులు ఆసుపత్రి బయట ఆందోళన చేపట్టారు.పోలీసులకు సమాచారం అందడంతో, ఆసుపత్రికి చేరుకొని పరిస్థితులను అదుపు చేశారు.

హాస్పటల్ మేనేజ్మెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube