కుంకుమ పువ్వును ఈ పద్ధతుల్లో సాగు చేస్తే.. ఆదాయం లక్షల్లో..!

కుంకుమపువ్వు అనగానే కాశ్మీర్ కుంకుమపువ్వు, ఇరాన్ కుంకుమపువ్వు, పర్షియన్ కుంకుమపువ్వు అనే పేర్లు గుర్తుకొస్తాయి.ఇక నాణ్యత విషయానికి వస్తే మొదటి స్థానం కాశ్మీర్ కుంకుమపువ్వు కు దక్కుతుంది.

 If Saffron Is Cultivated In These Methods.. The Income Is In Lakhs , Kashmir ,-TeluguStop.com

కుంకుమపువ్వు సాగుకు చల్లటి వాతావరణం అవసరం.కాబట్టి నవంబర్ నుండి మార్చి వరకు ఈ పంటకు చాలా అనువైన కాలం అని చెప్పవచ్చు.

నీటి అవసరం చాలా తక్కువ కేవలం నెలకు రెండు సార్లు నీటిని అందిస్తే చాలు.కానీ సారవంతమైన ఇసుక ఉండి, బంక మట్టి తక్కువగా ఉండే నెలలో సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుంది.

మన తెలుగు రాష్ట్రాల్లో కుంకుమపువ్వు పండించడం అసాధ్యం.కారణం ఏమిటంటే వాతావరణం, నేలలు అనుకూలంగా ఉండవు.

వ్యవసాయంలో నూతన పద్ధతులు రావడంతో ఆర్టిఫిషియల్ క్లైమేట్ ను క్రియేట్ చేసి కుంకుమపువ్వును సాగు చేసే అవకాశం ఉంది.అంటే 10 నుండి 15 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

నీరు ఎక్కువగా అందిస్తే విత్తనం పాడయ్యే అవకాశం ఉంది.ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తే పెట్టుబడి వృధా అవుతుంది.

కాబట్టి ఒక చిన్న రూమ్ లో ఆర్టిఫిషియల్ క్లైమాట్ క్రియేట్ చేసి, కాశ్మీర్ సీడ్స్ కుంకుమపువ్వు పండించి సొంతంగా మార్కెట్లో అమ్మగలిగితే మంచి ఆదాయం పొందవచ్చు.కుంకుమపువ్వు చాలా సున్నితమైనది.

ఇందులో ఆరోమా ఫ్లేవర్ కు ఎటువంటి హాని కలగకుండా పువ్వులో నుంచి సాఫ్రాన్ వేరు చేయాలి.ఇంకా కంటైనర్ ప్యాక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

అరోమా ఫ్లేవర్ లేకపోతే నాణ్యత కోల్పోయి, గిట్టుబాటు ధర ఉండదు.

Telugu Agriculture, Aroma, Farmers, Yield, Kashmir, Latest Telugu, Saffron-Lates

ఆర్టిఫిషియల్ క్లైమేట్ లో సాగు చేసేటప్పుడు Co2 పెరగకుండా, టెంపరేచర్ పై ఎప్పుడూ దృష్టి ఉంచాలి.ఇక కుంకుమ పువ్వులో దాదాపుగా 1.5 కిలోల దిగుబడి పొందవచ్చు.నాణ్యత గల కుంకుమ పువ్వు మార్కెట్లో దాదాపుగా 6 లక్షల ధర పలుకుతుంది. ఈ సాగులో చీడపీడల బెడద అంతగా ఉండదు.సాగు ఖర్చు మాత్రం కాస్త ఎక్కువే.కానీ ఎకరాకు 9 లక్షల ఆదాయం పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube