మ్యూజిక్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువగా ఉంటారు.కొంత మందికి పాటలు వింటే కాస్త రిలాక్స్ అనిపిస్తుంది.మ్యూజిక్ ప్రియుల కోసం బడ్జెట్లో బెస్ట్ హోమ్ థియేటర్స్ ఏంటో చూద్దాం.
F&D స్పీకర్స్
: 2.1 మల్టీమీడియా బ్లూటూత్ స్పీకర్, మల్టీ కలర్ డిస్ప్లే, రిమోట్ కంట్రోల్, 14 వాట్స్ సాటిలైట్ స్పీకర్స్, 28 వాట్స్ సబ్ ఊఫర్, యూఎస్బీ, ఎస్డి కార్డ్ లాంటి ఫీచర్స్ తో రూ.5,490 ఎమ్మార్పీ ధరలో వన్ పర్సెంట్ డిస్కౌంట్ తో రూ.5,437 కు వినియోగదారులకు అందుబాటులో ఉంది.
F&D స్పీకర్స్ మరింత తక్కువ ధరలో రూ.2,490 లతో మరో స్పీకర్ ని కూడా అందుబాటులోకి తెచ్చింది.స్టైలిష్ డిజైన్, సౌండ్ ఉఫర్ లతో 15 వాట్స్ హోమ్ థియేటర్ అందుబాటులో ఉంది.
ఫిలిప్స్ వైర్డ్ స్పీకర్స్
: 32 వాట్స్ వైర్లెస్ బ్లూటూత్, వైర్డ్ కంప్యూటర్ స్పీకర్స్ ఎమ్మార్పీ పై 40% డిస్కౌంట్ తో రూ.2,990 లకు అందుబాటులో ఉంది.
జెబ్రానిక్స్ హోమ్ థియేటర్
: 5.1 ఛానల్ 65 వాట్స్ బ్లూటూత్ స్పీకర్, ఫైవ్ సాటిలైట్ స్పీకర్స్, సబ్ ఉ ఫర్ తో కలిపి 65 వాట్స్ ఔట్పుట్ ఇస్తుంది.రిమోట్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది.ఎమ్మార్పీ పై 28% డిస్కౌంట్ తో రూ.3,599 లకు అందుబాటులో ఉంది.
ఫిలిప్స్ 60 వాట్స్
: 2.1 ఛానల్ 60 వాట్స్ హోమ్ థియేటర్.ఎల్ ఈ డి డిస్ప్లే, రిమోట్ కంట్రోల్, 2*17 సాటిలైట్ స్పీకర్స్, మల్టీ కనెక్టివిటీ ఆప్షన్, ఫిజికల్ బటన్ కంట్రోల్, రేడియో, ఎస్ డి కార్డు, 26 వాట్స్ 5.25 ఇంచెస్ ఫీచర్లతో 30% డిస్కౌంట్ తో రూ.5,100 అందుబాటులో ఉంది.
బోట్ బ్లూటూత్ బార్
: 2.1 ఛానల్ 80 వాట్స్ బ్లూటూత్ సౌండ్ బార్, 40 వాట్స్ ఔట్పుట్ తో సౌండ్ బార్, 40 వాట్స్ అవుట్ పుట్ తో సబ్ ఊఫర్ ఫీచర్లతో ఎంఆర్పి పై 55% డిస్కౌంట్తో రూ.6,299 కు అందుబాటులో ఉంది.