కే విశ్వనాధ్ అనేక సినిమాలను తీశారు.కళలకు ప్రాణం పోస్తూ ఆయన తీసిన సినిమాలు చరిత్రను సృష్టించాయి.
అయితే ఆయన ఎంతో అద్భుతమైన సినిమాలను తీసినా కూడా కొన్ని విడుదలకు నోచుకోకుండా ఉన్నాయి.అలాంటి వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం సిరిమువ్వల సింహనాదం.
ఈ చిత్రంలో మాధవి మాల ఎంతో అద్భుతంగా నటించింది అంతే బాగా నర్తించింది.ఇక మహదేవన్ అందించిన సంగీతం కూడా సినిమాను మరో మెట్టు ఎక్కించింది.
ఇంత అద్భుతంగా తీసిన సినిమా విడుదల ఎందుకు కాలేదు తెలియదు కానీ ఈ రీల్ నీ డిజిటల్ చేయించి యూట్యూబ్ లో విడుదల చేయాలని ప్రయత్నించి చాలా మంది విఫలం అయ్యారు.

విశ్వనాథ్ లాంటి దర్శకుడికి ఒక సినిమా విడుదల చేసుకోలేని పరిస్థితి రావడమే అత్యంత బాధాకరం.అందుకే ఆయన అడిగిన వారికి కాదనకుండా ప్రింట్ ల్యాబ్ నుంచి తెప్పించి మరీ షో వేసి చూపించేవారు.కానీ ఆ సినిమా థియేటర్లోనే విడుదల అవ్వాలని కలలు కన్నారు అది సాధ్యం కాలేదు.
ఈ సినిమా ఒక ఆడవేషం వేస్తున్న నటుడికి జీవితంలో ఎలాంటి తీవ్రమైన సంఘటనలు జరిగాయి, ఎలా కథ సుఖాంతం అయ్యింది అనేది అసలు కథ.ఇక ఈ సినిమాలో విలన్ గా ఓంపురి నటించాడు.ఇక విశ్వనాథ్ గారు ఈ సినిమా విడుదల గురించి మాట్లాడుతూ తాను గొప్ప సినిమా తీశానని చెప్పడం లేదు కానీ నేను తీసిన సినిమా జనంలోకి వెళ్లి నేను తప్పు తీసానా, గొప్పగా తీశానా చెబితేనే నాకు సంతృప్తి కలుగుతుంది అని చెప్పారు.

రచయిత రామలక్ష్మి బృందం ఈ సినిమాని డిజిటల్ గా రిలీజ్ చేయాలని చాలా ప్రయత్నించి అది సఫలం కాక విరమించుకున్నారు.ఈ లోగా విశ్వనాధ్ గారు సైతం కన్నుమూశారు.ఇక ఆ సినిమా గురించి మాట్లాడేవారు ఉండరు.
అయినా అలాంటి ఒక గొప్ప దర్శకుడు సినిమా విడుదలకు నోచుకోకపోవడం ఎంతో బాధాకరం.కనీసం ఓటిటి లో అయిన ఆయన జ్ఞాపకార్థం విడుదల చేస్తే బాగుంటుందని కొంతమంది ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.