విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని చాలా కాలంగా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా సొంత పార్టీలోనే తనకు వ్యతిరేక వర్గం తయారవడం , దీనికి పార్టీ అధిష్టానం నుంచి మద్దతు లభిస్తూ ఉండడంతో, నాని చాలాకాలంగా టిడిపిలో అసంతృప్తితో ఉంటున్నారు.
దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో విజయవాడ టిడిపి ఎంపీగా తన సోదరుడు కేశినేని చిన్నికి అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం, తన పరపతిని తగ్గించే విధంగా టిడిపి కి చెందిన విజయవాడ నేతలతో తనపై విమర్శలు చేయిస్తూ ఉండడం, పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం కల్పించకపోవడం వంటి కారణాలతో నాని అసంతృప్తితో ఉంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదా అనేది కూడా సందేహంగా మారింది.ఈ నేపథ్యంలోనే ఆయన బిజెపిలో చేరతారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది.పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై నాని కూడా అనేక సందర్భాల్లో స్పందించారు.
రెండుసార్లు ఎంపీగా గెలిచిన తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని , చంద్రబాబు చుట్టూ చేరిన కోటరీ వల్లే టీడీపీ నాశనం అవుతున్నాడు అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.ఈ వ్యవహారాలు ఇలా ఉండగానే నానికి కేంద్రం కీలక పదవి కట్టబెట్టింది .ఎన్టీఆర్ జిల్లా దిశ కమిటీ చైర్మన్ గా ఆయనను నియమించింది.
దీంతో ఇక జిల్లాలో కేంద్ర పథకాలకు ఆయన కీలకం కాబోతున్నారు.తాజాగా కేంద్రం జాతి స్థాయిలో అనేక నియామకాలు చేపట్టింది.ఏపీలోని అనే జిల్లాలో చేపట్టిన నియామకల్లో భాగంగా చేసిన నానికి సొంత జిల్లా ఎన్టీఆర్ కృష్ణాజిల్లాకు నేతృత్వం వహించే అవకాశాన్ని కల్పించారు.
ముఖ్యంగా టిడిపిలోని నాని వ్యతిరేఖ వర్గంకు ఈ వ్యవహారం మింగుడు పడడం లేదట.ఆయనకు బీజేపీ ఈ స్థాయిలో ప్రాధాన్యం కల్పించడం వెనుక కారణాలపై ఆరా తీస్తున్నారట.