కాకినాడ జిల్లా జి.రాగంపేట ఆయిల్ ఫ్యాక్టరీ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫైవ్ మెన్ కమిటీ విచారణ చేపట్టింది.
ప్రమాదానికి కారణమైన ఏడీబీఎల్ ఆయిల్ ట్యాంకర్ నుంచి అధికారులు ఆయిల్ మడ్ శాంపిల్స్ సేకరించారు.
ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసిన అనంతరం కమిటీ సభ్యులు కలెక్టర్ కు నివేదిక అందించనున్నారు.కాగా ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేసేందుకు వెళ్లి ఊపిరాడక ఏడుగురు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
.