రాళ్లపల్లి చేత దర్శకుడు బాపు ఉద్యోగం ఎందుకు మాన్పించారు?

నాటక రంగంలో విశిష్ట పేరు సంపాదించుకున్న రాళ్లపల్లి సినిమా ఇండస్ట్రీకి వచ్చి తన నటన ప్రభావాన్ని కొనసాగించారు.స్వాతంత్రం రావడానికి రెండేళ్ల ముందు పుట్టిన రాళ్లపల్లి 1960 సమయంలో నాటకాల్లో నటించడం మొదలు పెట్టారు.

 Why Bapu Encouraged Rallapalli To Quit His Job,director Bapu,rallapalli,shree Mo-TeluguStop.com

మొట్టమొదటి సారిగా తెరపై కనిపించింది మాత్రం 1970లో స్రీ అనే సినిమాలో .అందులో కిరాణా షాప్ యజమానిగా తొలిసారి నటించారు.అదే తరహా పాత్రను నిరీక్షణ సినిమాలోనూ కొనసాగించారు రాళ్లపల్లి.ఇక ఆయన సాంగ్ డ్రామా డివిజన్లో 2000 జీతానికి పనిచేసేవారు.ఓవైపు పని చేస్తూనే మరోవైపు నాటకాలు వేసేవారు.

Telugu Bapu, Rallapalli, Shree, Tollywood, Villain-Movie

దర్శకుడు బాపు ఒకసారి రాళ్లపల్లిని ఉద్యోగం మానేయమని సలహా ఇచ్చారట.నువ్వు ఉద్యోగం మానేస్తే మీకు మళ్ళీ ఉద్యోగం చేయాల్సిన అవసరం రానంత ఎక్కువగా ఆఫర్స్ వస్తాయని, అందుకు తానే గ్యారెంటీ అని చెప్పి మరి రాళ్లపల్లిని మోటివేట్ చేశారు దర్శకుడు బాపు.దాంతో రాళ్లపల్లి నిజంగానే ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా ఇండస్ట్రీలో ఉంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు.

అలా ఆయన చేసిన చిత్రం తూర్పు వెళ్లే రైలు.ఈ సినిమాలో హీరోయిన్ కి బావ పాత్రలో ఆయన నటించారు.ఆ తర్వాత ఏ రోజు మళ్ళీ వెనక్కి చూసుకోవలసిన అవసరం రాలేదు.నిజానికి కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చే వారికి అదొక స్వర్ణ యుగం లాంటి సమయం కావడంతో రాళ్లపల్లి తో పాటు నూతన ప్రసాద్ పి ఎల్ నారాయణ వంటి అనేకమంది రంగస్థల నటులు తెలుగు తెరకు పరిచయమయ్యారు.

Telugu Bapu, Rallapalli, Shree, Tollywood, Villain-Movie

కేవలం రాళ్లపల్లి నటుడు మాత్రమే కాదు విలన్ పాత్రధారి, మంచి కమెడియన్, అంతకుమించిన రచయిత కూడా.కామెడీ ట్రాకులు కూడా అద్భుతంగా రాసేవారు.రాళ్లపల్లి నిండైన జీవితాన్ని అనుభవించారు.చివరగా ఆయన నటించిన సినిమా జయం.ఆ తర్వాత వయోభారం కారణంగా సినిమాలు మానేశారు రాళ్లపల్లి జీవితంలో ఆయన పెద్ద కూతురు మరణం అతిపెద్ద విషాదం.ఆ బాధలోనే ఆయన చాలా రోజులు సినిమాలు కూడా చేయలేక పోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube