బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం విధించడంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.ఈ మేరకు జర్నలిస్ట్ ఎన్ రామ్, న్యాయవాదులు ఎం ఎల్ శర్మ, ప్రశాంత్ భూషణ్ లు పిటిషన్లు దాఖలు చేసినట్లు సమాచారం.
పిటిషన్లను విచారించేందుకు అంగీకరించింది సుప్రీం ధర్మాసనం.ఈ క్రమంలో వచ్చే సోమవారం విచారణ చేస్తామని వెల్లడించింది.
అయితే, నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న చర్య రాజ్యాంగపరమైన ప్రశ్నలకు తావిస్తోందన్న పిటిషనర్… గుజరాత్ అల్లర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు.మోదీకి వ్యతిరేకంగా 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే.
కాగా మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ దురుద్దేశపూరితమైనదని, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ దాన్ని కేంద్రం నిషేధించింది.