దేశవ్యాప్తంగా సైబర్ మోసం కేసులు వేగంగా పెరుగుతున్నాయి.రోజురోజుకు కొత్త కొత్త విధానాల్లో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు మాయం అవుతోంది.
ఈ సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా ఇంటర్నెట్‌ని ఉపయోగించాలి.ఈ రోజు మోసం చేసే వారు ఎక్కువగా ఇన్ యాక్టివ్‌లో ఉన్న సిమ్‌లను టార్గెట్ చేసుకుంటున్నారు.దీని ద్వారా కస్టమర్ల ఖాతా మొత్తం ఖాళీ చేసేస్తున్నారు.ఈ మోసాలు ఎలా జరుగుతున్నాయో, మీరు దీన్ని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.
బ్యాంకింగ్‌లో మొబైల్ ఫోన్ చాలా ముఖ్యమైన భాగం.ఈ రోజుల్లో చాలా మంది తమ బ్యాంకింగ్ పనిని ఇంటి నుంచే మొబైల్ ద్వారా చేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఖాతా, బ్యాలెన్స్ మరియు లావాదేవీల గురించిన మొత్తం సమాచారాన్ని మొబైల్‌లో పొందుతారు.ఇది కాకుండా, OTP కోసం మొబైల్ నంబర్ కూడా ఉపయోగించబడుతుంది.
ప్రస్తుతం అంతా రెండు సిమ్‌లను వినియోగిస్తున్నారు.
అయితే కేవలం ఒకటి మాత్రమే సిమ్ వాడుతూ, మరో సిమ్‌ను రీఛార్జ్ చేయించుకోవడం లేదు.దీంతో ఆ రెండో సిమ్ ఇన్‌యాక్టివ్ అవుతుంది.ఆ ఇన్‌యాక్టివ్ లేదా లాక్ అయిన సిమ్‌ను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలచుకుంటున్నారు.
సిమ్‌లు విక్రయిస్తున్న వారితో కుమ్మక్కై ఆ సిమ్‌లను తీసుకుంటున్నారు.వాటిని యాక్టివ్ చేసి, వాటితో అనుసంధానం అయిన బ్యాంకు ఖాతాల గురించి తెలుసుకుంటున్నారు.
యూపీఐ యాప్‌లను ఓపెన్ చేసి, రోజుకు రూ.లక్ష చొప్పున స్వాహా చేస్తున్నారు.దీంతో ఇలా ఇన్‌యాక్టివ్‌లో ఉండే సిమ్‌ల ద్వారా వారు ఇలా అమాయకుల బ్యాంకు ఖాతాలను గుల్ల చేసేస్తున్నారు.అందుకే సిమ్ లు ఇన్ యాక్టివ్ లో ఉంటే జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.