మినీ మేడారం జాతరకు పటిష్టమైన భద్రత ఏర్పాటు..

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మినీ మేడారం జాతరకు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ గౌస్ ఆలం వెల్లడించారు.స్థానిక పోలీసులతో కలిసి మేడారంలోని సమ్మక్క సారక్క వనదేవతలను దర్శించుకున్నారు.

 Tight Security Arrangement For Mini Medaram Fair, Mini Medaram, Sammakka Saralam-TeluguStop.com

ఎండోమెంట్ అధికారులు, పూజారులు డోలు, వాయిద్యాలతో దేవాలయ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా అధికారులకు స్వాగతం పలికారు.సమ్మక్క, సారక్క పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలను అధికారులు దర్శించుకున్నారు.

అధికారులు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.భద్రతాపరమైన ఏర్పాట్ల అనంతరం మేడారంలోని పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారం మినీ జాతరలో ఎలాంటి గొడవలు, గలాటాలు జరగకుండా 400 మంది పోలీసు అధికారులతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.దొంగతనాలు ఇంకా జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిగాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Telugu Devotional, Medaram, Mulugu, Tadvai-Telugu Bhakthi

అంతే కాకుండా ఈ మినీ మేడారం జాతర కు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మినీ మేడారం జాతర చేరుకుని వనదేవతలను దర్శించుకునీ ప్రశాంతంగా వారి ఇంటి తిరిగి వెళ్లవచ్చని వెల్లడించారు.మేడారంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.క్యూలైన్లు మేడారం గద్దెల ప్రాంగణం, ఆర్టిసి బస్టాండ్, చిలకల గుట్ట రెడ్డి గూడెం మన సందోహం అధికంగా ఉండే ప్రాంతాల్లో కట్టుకుట్టమైన భద్రతను ఏర్పాటు చేపట్టినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో పసర సీఐ వంగా శంకర్, పసర ఎస్సై కరుణాకర్ రావు, స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు, సిఆర్పిఎఫ్, సివిల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ మినీ మేడారం జాతర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తి కావాలని మనమందరం కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube