వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేసేందుకు అధికార వైసీపీ నుండి కొందరు నేతలు ముందుకు వస్తున్నారు.2024 ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ఇంతవరకు ధృవీకరించనప్పటికీ, ఆయనను మళ్ళీ ఆపేందుకు మాత్రం పలు నాయకులు అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు మహ్మద్ అలీ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.జగన్ మోహన్ రెడ్డి కోరితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానని స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
సినిమాలు, రాజకీయాలకు భిన్నమైనవని… పవన్ కళ్యాణ్, తాను సినిమాల్లో మంచి స్నేహితులు అయినప్పటికీ రాజకీయాల్లో ప్రత్యర్థులని ఆయన అన్నారు.

అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ను ఓడించాలనే తపనతో ఉన్నారని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో విశాఖపట్నంలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు.ఈసారి కూడా జగన్ మోహన్ రెడ్డి ని పవన్ తన బాంబులు పేల్చే మాటలతో, విమర్శలతో తెగ ఇబ్బందిపెడుతున్నాడు.
అందుకే ఈ సారి మళ్లీ జనసేన అధినేతను ఓడించడంపై దృష్టి సారించారు ఏపీ సీఎం.

పవన్‌కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా ఓడించాలని జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ ఏడాది డిసెంబర్‌లో గానీ, వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో గానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండడంతో ఇద్దరు నేతలు ఏ మేరకు పట్టుదలతో ఉన్నారో చూడాలి.నిజంగా జగన్ ఈసారి కూడా ఈ విషయంలో సఫలం అయితే జనసేన వెన్ను విరిచినట్లు అవుతుంది.
అయితే జనశైనికులు మాత్రం ఎలాగైనా ఈసారి తమ అధినేతను గెలిపించుకుని అసెంబ్లీ మెట్లు ఎక్కించాలని చూస్తున్నారు.పవన్ వంటి వాడు అసెంబ్లీలో నోరు తెరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కుదేలయ్యే అవకాశాలు ఉన్నాయిm మరి జగన్ ఎన్నికల సమయానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తాడో చూడాలి.!
.