పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఈయన మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉండగా సినిమాలను పక్కన పెట్టాడు.
ఇక ఇప్పుడు మళ్ళీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.ప్రెజెంట్ హరిహర వీరమల్లు సినిమా చేస్తూనే తర్వాత లైనప్ ను సెట్ చేసుకుంటున్నారు పవన్.
మరి ఈ లైనప్ లో పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో కూడా ఉంది.
వీరి కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రకటించిన విషయం తెలిసిందే.
అఫిషియల్ గా ఈ సినిమా నుండి అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఉన్నారు.ఇక ఈ ప్రాజెక్ట్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.
మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో ఇంకా తెలియలేదు.
అయితే వీటి కంటే ముందే పవన్ మరో రీమేక్ సినిమాకు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక రీమేక్ సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే అఫిషియల్ గా కన్ఫర్మ్ చేసేసారు.వినోదయ సీతమ్ అనే రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడు.ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కనుంది.
ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పవర్ స్టార్ యాటిట్యూడ్ కు సింక్ అయ్యేలా సముద్రఖని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా ఈ నెల 27 నుండి రెగ్యురల్ షూట్ స్టార్ట్ కాబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 45 రోజులు కాల్ షీట్స్ ఇచ్చినట్టు సమాచారం.ఈ సినిమా ఫాస్ట్ గా పూర్తి చేసి అప్పుడు హరీష్ శంకర్ సినిమాలో జాయిన్ అవ్వనున్నాడు పవన్.
ఇక ఈ గ్యాప్ లో హరిహర వీరమల్లు పూర్తి చేస్తాడో లేదో చూడాలి.