1.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
2.జనసేన పై ఏపీ మంత్రి కామెంట్స్
జనసేన పార్టీ పైన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.జనసేన పేరు తీసి చంద్రసేన అని పెట్టుకుంటే బెటర్ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు.
3.కరీంనగర్ లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాం
పది ఎకరాల స్థలంలో కరీంనగర్ లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
4.ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ప్రారంభం
ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ అయిన ఎం.వి గంగా విలాస్ ను ప్రధాని నరేంద్ర మోది ప్రారంభించారు.
5.నేడు, రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు
పొంగల్ పండుగ వరుస సెలవులను పురస్కరించుకొని శుక్ర, శనివారాల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని సీఎంఆర్ ఎల్ అధికారులు తెలిపారు.
6.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
7.నేటి నుంచి అయినవోలు మల్లన్న జాతర
నేటి నుంచి అయినవోలు మల్లన్న జాతర జరగనుంది.అయినవోలు మల్లికార్జున స్వామికి అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు.
8.గవర్నర్ పై చర్యలు తీసుకోండి
తమిళనాడు శాసనసభలో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహరించిన తీరుపై ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపది మర్ము కు డిఎంకె ఫిర్యాదు చేసింది.ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.
9.హిడ్మా చనిపోలేదు
మావోయిస్టు అగ్రనేత ముడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ ఇద్ముల్లా ఎన్ కౌంటర్ లో మృతి చెందలేదని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది.
10.చేగువేరా కుమార్తె హైదరాబాద్ రాక
ఈనెల 22 సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్ర భారతిలో చేగువేరా కుమార్తె అలైదా ఎస్టిపోనియా ను వివిధ రాజకీయ పార్టీలు , పలు ప్రజా సంఘాలు సన్మానించనున్నాయి.
11.సీఎం జగన్ కు ముద్రగడ లేఖ
ఏపీ సీఎం జగన్ కు మరోసారి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేక రాశారు.కాపు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఈ లేక ద్వారా ఆయన కోరారు.
12.పవన్ కళ్యాణ్ పగటి వేషగాడు : అప్పలరాజు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పగటి వేషగాడని, చంద్రబాబుకు ఆయన పూర్తిగా అమ్ముడుపోయాడని ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు.
13.తమిళనాడు బీజేపీ అధ్యక్షుడికి జెడ్ కేటగిరి
తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నమయ్య జెట్ కేటగిరి భద్రత ను కేంద్రం ఏర్పాటు చేయనుంది.అన్నమయ్య రక్షణగా మొత్తం 33 మంది సీఆర్పీఎఫ్ కమాండోలను నియమించనున్నారు.
14.టిడిపి ఎంపీ కేసినేని కామెంట్స్
టిడిపి ఎంపి కేసినేని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు .ప్రజా సేవ చేయాలంటే నేనే సామంత రాజును అని ఫీల్ కాకూడదని, తానే ఆరుసార్లు ఎమ్మెల్యే అవ్వాలి కానీ ఎనిమిది సార్లు మంత్రి అవ్వాలంటే కుదరదు ఆయన వ్యాఖ్యానించారు.
15.గోదాదేవి కళ్యాణం
నేడు టీవీఎస్ కళ్యాణ్ సదన్ లో గోదాదేవి కల్యాణం జరగనుంది.ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు.
16.నేడు కృష్ణ యాజమాన్య బోర్డు సమావేశం
నేడు కృష్ణ యాజమాన్యం బోర్డ్ సమావేశం జరగనుంది .దీనికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరుకానున్నారు.కృష్ణాజిల్లాలో నీటి వాటాలపై చర్చ జరగనుంది.
17.కామారెడ్డి రైతుల పిటిషన్ పై నేడు విచారణ
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు వేసిన పిటీషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది.
18.కెసిఆర్ సభపై హరీష్ రావు సమీక్ష
ఈనెల 18 ఖమ్మం సీఎం కేసీఆర్ బహిరంగ సభపై నేడు మంత్రులు హరీష్ రావు సమీక్ష నిర్వహించనున్నారు.జిల్లా నేతలు అధికారులతో కలిసి సభ వేదికను వారు పరిశీలించనున్నారు.
19.కేంద్ర మాజీ మంత్రి మృతి
మాజీ కేంద్రమంత్రి శరత్ యాదవ్ కన్నుమూశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,600 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 56,290
.