మెగాస్టార్ చిరంజీవి మీద విష ప్రయోగం జరిగిందని మీకు తెలుసా? అవును మీరు వింటుంది నిజమే.మెగాస్టార్ మీద తనని ఎంతగానో అభిమానించే అభిమానే విష ప్రయోగం చేసాడట.
ఈ విషయాన్నీ వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో చిరు చెప్పగా ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.ఇంతకీ ఆ అభిమాని ఎందుకు విష ప్రయోగం చేసాడు?మెగాస్టార్ దీని నుండి ఎలా బయట పడ్డారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
”మరణమృదంగం” సినిమా చేస్తున్న సమయంలో షూటింగ్ స్పాట్ లో ఈ విష ప్రయోగం జరిగిందట.ఒక అభిమాని షూటింగ్ గ్యాప్ లో కేక్ తీసుకొచ్చి బలవంతంగా నా నోట్లో పెట్టారని చేదుగా ఉండడంతో తినకుండా వెంటనే పడేశానని ఆ విషయాన్నీ సెట్లో ఉన్నవారికి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది అని అన్నారు.నిర్మాత విషయం తెలుసుకుని అతన్ని పట్టుకుని నాలుగు తన్నడంతో అతడు అసలు విషయం చెప్పారట.
ఆ అభిమాని తనని పట్టించు కోవడం లేదని కేరళ వెళ్లి మరీ వశీకరణ మందును తీసుకొచ్చి చిరు తినే కేక్ లో తినిపించగా ఈయన చేసిన పనికి అంతా షాక్ అయ్యారట.తనతో మాట్లాడడం లేదని ఆ అభిమాని అలా చేసాడని చెప్పాడని.అది విని అతడిని వదిలేశామని అన్నారు.
ఈ విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.
ఇక వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే.ఈ సినిమా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.చిరంజీవి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’.2023 సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్య వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.చూడాలి మరి బాలయ్యతో పోటీలో చిరు విన్ అవుతాడో లేదో.