బుల్లితెర నటి, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే.యాంకర్, డాన్సర్, యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది హరితేజ.
మొదట ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది.
తన నటనకు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత బుల్లితెరలో మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.
దాదాపు ఏడు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.అంతేకాకుండా బుల్లితెర లో పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.
ఆ తర్వాత 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.
బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది హరితేజ.
ఇక ఆమె దీపక్ అనే వ్యక్తి ని పెళ్లి చేసుకోగా.
వారికి ఒక కూతురు కూడా ఉంది.ఇక హరితేజ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.
ఇక తన భర్త తో చేసే రీల్స్ కూడా షేర్ చేసుకుంటుంది.తన కూతురు ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

తనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.వాళ్లు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతుంది.ఇక తనకు మరో బుల్లితెర నటి నవ్య స్వామి మంచి ఫ్రెండ్.తనతో కలిసి జిమ్ వర్కౌట్లు చేస్తూ ఉంటుంది.ఇద్దరు కలిసి పార్టీలంటూ తిరుగుతూ బాగా రచ్చరచ్చ చేస్తారు.
అప్పుడప్పుడు కొన్ని ట్రిప్స్ కూడా వేస్తూ ఉంటారు.అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది.

అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే ఈవెంట్లలో కూడా పాల్గొని తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా హరితేజ తన ఇన్ స్టా లో ఓ స్టోరీ పంచుకుంది.అందులో తను తన భర్తతో సరదాగా కనిపించింది.తన భర్త తనను గట్టిగా ముద్దు పెట్టుకోగా తను మాత్రం సెల్ఫీ వీడియో తీస్తూ నవ్వుతూ మధ్య తరగతి ప్రేమలు అంటూ ఆ వీడియో షేర్ చేసుకుంది.
ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వగా తమ ఫ్యాన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.అంతేకాకుండా కొందరు సరదాగా కామెంట్లు కూడా పెడుతున్నారు.ఇక హరితేజ ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ బాధ్యతలను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది.