సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు మిస్ చేసుకున్న సినిమాలను మరొక హీరోలు చేస్తూ ఉంటారు.కొందరు రిజెక్ట్ చేసిన కథలను మరికొందరు హీరోలు చేసి మంచి హిట్ ను అందుకుంటూ ఉంటారు.
ఇటువంటి ఘటనలు సినీ ఇండస్ట్రీలో ఎన్నో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.అలా వారి దగ్గరికి వచ్చిన కథలను మరొకరు చేస్తే బాగుంటుంది అని ఎక్కువగా దర్శక నిర్మాతలు సూచిస్తూ ఉంటారు.
ఆ విధంగా అప్పట్లో ఒక సినిమా కోసం చిరంజీవి తన సహనటుడు స్నేహితుడు ఆయన రాజశేఖర్ ను రికమెండ్ చేశారట.ఆ సినిమా మరేదో కాదు న్యాయం కోసం.
రవి రాజా పినిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.అప్పట్లో మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా మలయాళం లో మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న.
ఒరు సీబీఐ డైరీ కురిప్పు అనే సినిమా ఆధారంగా రూపొందించారు.కాగా ఇందులో సీబీఐ ఆఫీసర్ పాత్ర చేయాల్సిన చిరంజీవి స్వయంగా ఆ పాత్రకు రాజశేఖర్‌ను రికమెండ్ చేశారట.
మలయాళం లో ఒరు సీబీఐ డైరీ కురిప్పు సినిమా అప్పట్లోనే మద్రాసులో విడుదలై సంచలనం సృష్టించింది.ఆ చిత్రం గురించి నటుడు రాజశేఖర్ విని తన నిర్మాతలలో ఎవరితోనైనా ఆ చిత్రం హక్కులు కొనిపించి ఆ సినిమాలో నటించాలనుకున్నారు.
అయితే, అప్పటికే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆ హక్కుల్ని కొనేశారని రాజశేఖర్‌కు తెలిసింది.దాంతో చిరంజీవితోనే ఆ సినిమా తీస్తారని ఊహించి రాజశేఖర్ నిరాశ చెందారు.
తర్వాత ఆ సినిమా చూసి, చిరంజీవి లక్కీ పర్సన్, అని మనసులోనే అనుకుని, ఆ విషయాన్ని మర్చిపోయారు.ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక సినిమాకు సంబంధించిన వేడుకలలో రాజశేఖర్, అల్లు అరవింద్ కలుసుకున్నారు.
ఆ సమయంలో అల్లు అరవింద్ ఒరు సీబీఐ డైరీ కురిప్పు చిత్రం హక్కులు తానుకొన్న సంగతి చెప్పి, అందులో నటిస్తావా అని రాజశేఖర్‌ని అడిగగా ఆ ఒక్క మాటతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ తన అంగీకారాన్ని తెలిపారు.ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అరవింద్‌తో మీరు రైట్స్ కొన్నారని తెలియగానే చిరంజీవిగారితోనే సినిమా తీస్తారని అనుకున్నా.ఇంతమంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ రాజశేఖర్ అల్లు అరవింద్ కి కృతజ్ఞత చెప్పారట.అప్పుడు వెంటనే అరవింద్ నవ్వి మొదట చిరంజీవితోనే తీద్దామనుకున్నాం.కానీ, ఆయనకి కాల్షీట్ల సమస్య.అప్పుడు ఏం చేద్దామా? అని ఆలోచిస్తుంటే చిరంజీవే స్వయంగా మీ పేరు సజెస్ట్ చేశారనీ అల్లు అరవింద్ చెప్పడంతో చిరంజీవిని కలిసి రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారట.