మెగా ఫ్యామిలీ గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్ వచ్చినా నాగబాబు అస్సలు తట్టుకోలేరని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.పొలిటికల్ గా ఆశించిన ఫలితాలను సాధించకపోయినా చిరంజీవిపై అటు పొలిటికల్ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో మంచి పేరు ఉంది.
చిరంజీవి అందరితో మంచిగా ఉండాలని అందరికీ మంచి చేయాలని భావిస్తారు.అయితే చిరంజీవి ఎంత మంచిగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయనపై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
చిరంజీవిపై వసున్న విమర్శల గురించి ఆయనపై నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్ల గురించి నాగబాబు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తాజాగా నాగబాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావడం సాధ్యమయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పారు.
చిరంజీవి గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే మొదట ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ వస్తుందని నాగబాబు పేర్కొన్నారు.
సినిమా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి వెళ్లిన సమయంలో కొందరు రాజకీయ నేతలు మెగాస్టార్ చిరంజీవి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాగబాబు పేర్కొన్నారు.
ఆయన పెద్ద నాయకుడు అయినంత మాత్రాన ఆయనను మేమేమీ అనలేదని నాగబాబు కామెంట్లు చేయడం గమనార్హం.చిన్నాపెద్దా అనే తేడా లేకుండా గౌరవించాలని నాగబాబు అన్నారు.
చిరంజీవి స్థానం ఎప్పటికీ మారదని అయితే రేపు నీ స్థానం మాత్రం మారొచ్చని నాగబాబు కామెంట్లు చేశారు.ప్రముఖ రాజకీయ నేత పేరు ప్రస్తావించకుండా నాగబాబు ఈ కామెంట్లు చేశారు.నాగబాబు చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.ప్రముఖ రాజకీయ నేతపై నాగబాబు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
నాగబాబు ప్రస్తుతం తక్కువ సంఖ్యలో సినిమాల్లో నటిస్తున్నారు.నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఇప్పటికే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.