సూపర్ స్టార్ మహేష్ బాబు వయస్సుకు ఆయన లుక్ కు ఏ మాత్రం పొంతన ఉండదు.ఆయన వయస్సు 47 సంవత్సరాలు అంటే నమ్మడం కష్టమని ఆయన ఫ్యాన్స్ సైతం భావిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.
అయితే తాజాగా మహేష్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ ఫోటోలో మహేష్ బాబు గౌతమ్ కు అన్నలా ఉన్నాడని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ అర్థం కావడం లేదని కొంతమంది నెటిజన్లు కామంట్లు చేస్తున్నారు.
సూపార్ స్టార్ మహేష్ బాబు వయస్సు సంవత్సరాలు గడిచే కొద్దీ తగ్గుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.మరోవైపు పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.
ఈ మధ్య కాలంలో తెలుగులో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ సినిమాలు తెరకెక్కడం లేదు.
ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు కచ్చితంగా కొత్త అనుభూతిని కలిగిస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
మహేష్ కు జోడీగా పూజా హెగ్డేను ఈ సినిమాలో ఎంపిక చేయడం కొంతమంది ఫ్యాన్స్ కు నచ్చకపోయినా త్రివిక్రమ్ మాత్రం పూజా హెగ్డే తన లక్కీ హీరోయిన్ కావడంతో ఆమెను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పూజా హెగ్డేతో త్రివిక్రమ్ తీసిన రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించగా పూజా హెగ్డే త్రివిక్రమ్ కాంబినేషన్ మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నారనే వార్త ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.