చలికాలంలో కుక్కలకి వెచ్చని ఇళ్లు ఏర్పాటు.. ఎక్కడంటే..

ఈ వింటర్ సీజన్‌లో రోజురోజుకీ చలి పెరిగిపోతుంది.ఈ చలికి మనుషులు ఇంటి నుంచి బయటికి రావడానికే భయపడుతున్నారు.

 Arrangement Of Warm Houses For Dogs In Winter Where , Dogs, Dog Shelters, Viral-TeluguStop.com

బయటికి వచ్చిన కూడా స్వేటర్స్, మప్లర్స్ లేకుండా బయటికి రావడం లేదు.ఇక ఇంట్లో ఉన్నా కూడా రకరకాల మందపాటి దుస్తులు ధరిస్తూనో , చలి మంటలు వేసుకుంటూనో వెచ్చదనం పొందుతున్నారు.

ఇలాంటి భయంకరమైన చలిలో మనుషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.పెంపుడు జంతువుల గురించి వారి యజమానులు శ్రద్ధ తీసుకుంటారు.

కానీ వీధిలో తిరిగే కుక్కలు, పిల్లులు లాంటి జంతువులను ఎవరూ పట్టించుకోరు.

జంతు ప్రేమికులు మాత్రం వీధిలో తిరిగే కుక్కలకు, పిల్లులకు వారికి తోచిన సహాయం వారు చేస్తారు.

ముఖ్యంగా చలికాలంలో.ఇతర దేశాలలో లాగా మన దగ్గర వీధి కుక్కలు, పిల్లుల కోసం ఆశ్రమాలు ఎక్కువగా లేవు.

చాలా సంస్థలకు వీధి జంతువులకు సహాయపడాలని కోరిక ఉంటుంది కానీ అందుకు సరిపడా సొమ్ము ఉండదు.అయితే ఇప్పుడు ‘స్ట్రె టాక్ ఇండియా’ వీధి జంతువులను రక్షించడం కోసం తమవంతు సహాయం చేయడానికి ముందుకు వస్తుంది.

ఈ సంస్థ శీతాకాలంలో వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించడం కోసం తక్కువ ఖర్చుతో సమర్ధవంతమైన పరిష్కారాన్ని కనుగొంది.ఈ సంస్థలోని సభ్యులు స్క్రాప్ డీలర్స్ నుంచి డామేజ్ అయిన ప్లాస్టిక్ లేదా వుడ్ ఫైబర్ డ్రమ్స్ ని సేకరించి వాటిలో దుప్పట్లు లేదా పరుపులు అమర్చి వీధి కుక్కలకు షెల్టర్ గా తయారుచేస్తున్నారు.

ఈ షెల్టర్స్ కి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ఆ పోస్ట్‌లో గురుగ్రామ్ A-13/36 DLF పేజ్‌-1 అని రాసి వుంది.అంటే ఆ అడ్రస్ కి వెళ్లడం ద్వారా ఉచిత డాగ్ హౌస్‌లను ఆదివారం 11 AM నుంచి అందుబాటులో ఉన్నాయని కామెంట్ పెట్టాడు.అయితే ఈ సంస్థ ఢిల్లీ-NCR చుట్టూ ఉన్న జంతు ప్రేమికులకు ఆశ్రయాలను ఉచితంగా అందిస్తుంది.

ఈ షెల్టర్స్ కి సంబంధించిన కొన్ని ఫొటోలకు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube