ఈ ఆధునిక ప్రపంచంలో అవసరం వున్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలోకి చేరిపోయింది.దాంతోనే ఇంటర్నెట్ వినియోగం విరివిగా పెరిగి పోయింది.
మరీ ముఖ్యంగా మన దేశంలో ఇంటర్నెట్ చార్జెస్ బాగా తక్కువ కారణంగా సోషల్ మీడియా వినియోగం అనేది రోజురోజుకీ పెరిగిపోతోంది.దాంతో పాటు టెక్నాలజీ దానికి అనుగుణంగా తయారవుతోంది.
గూగుల్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత జీవితాన్ని చాలా సులభతరం చేసేసింది.Ok Google… అనే రెండు పదాలు ఇపుడు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి అంటే అతిశయోక్తిగా ఉంటుంది.
ఇక ఈ ఒకే గూగుల్ కొందరికి తమకు తెలియని విషయాలను తెలుసుకోవడానికి వాడుతుంటే, మరికొందరు తమ ఆనందం కోసం కూడా వినియోగిస్తున్నారు.అవును, కొందరు ప్రజలు Googleని అవసరం లేకపోయినా ఉపయోగించడం మొదలు పెట్టారు.
ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోనే దానికి ఓ చక్కటి ఉదాహరణ.వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు గూగుల్‌ని అడిగిన ప్రశ్న వింటే ఎవరైనా నవ్వకుండా ఉండలేరు.
వైరల్ అవుతున్న వీడియోలో.మొబైల్‌లో గూగుల్ నుండి ఒక వృద్ధుడు ఏదో అడుగుతున్నట్లు గమనించవచ్చు.ఈ క్రమంలో ఆ వృద్ధుడు టంగ్ స్లిప్ అవ్వడం కూడా వినవచ్చు.అదేమంటే అతను గూగుల్‌కు బదులుగా గుల్ గుల్ అని పలకడం.అయితే అనంతరం ఆ పెద్దాయన గూగుల్ కు క్షమాపణలు కూడా చెప్పడం ఇక్కడ గమనించవచ్చు.ఇక్కడ ట్విస్ట్ ఏమంటే అతను అడిగే ప్రశ్నకు బహుశా గూగుల్ దగ్గర కూడా సమాధానం లేదేమో, సైలెంట్ గా ఉండిపోయింది.
అయితే ఆ ప్రశ్న ఏంటనేది తెలుసుకోవాలంటే మీరు ఆ వీడియో చూడాల్సిందే.