ఒక మూర్ఖుడు పరిపాలన చేస్తే రాష్ట్రం ఇలాగే ఉంటుంది - చింతకాయల అయ్యన్నపాత్రుడు

విజయనగరం: చింతకాయల అయ్యన్నపాత్రుడు.టీడీపీ అధ్యక్షులు జిల్లాలొక పర్యటిస్తున్నారు.24 న విజయనగరం లో రోడ్ షో ఏర్పాటు చేస్తున్నాం.యాభై వార్డు లలో జనం హాజరవ్వాలని కోరుతున్నాం.

 Chintakayala Ayyannapatrudu Shocking Comments On Jagan Government Details, Chint-TeluguStop.com

ఉత్తరాంధ్ర జిల్లాలో మూడురోజుల పర్యటనకు వస్తున్నారు.టీడీపీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర పార్టీకి కంచుకోటగా ఉంది.

జనం ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మాట్లాడున్నారు.ఇంతవరకు ప్రజలని భయభ్రాంతులకు గురిచేశారు.

ఒక మూర్ఖుడు పరిపాలన చేస్తే రాష్ట్రం ఇలాగే ఉంటుంది.వైసీపీ నాయకులు విచ్చలవిడిగా దోపిడీలు చేస్తున్నారు… ముఖ్యమంత్రే స్వయంగా దోపిడీ ఆపండి అని ఎమ్మెల్యే లకు చెప్పడం విడ్డూరంగా ఉంది.

విజయవాడలో వేల లారీల ఇసుక తెలంగాణా కి అక్రమంగా తరలిపోతుంది.నిర్మాణ రంగంలో ఉన్న వ్యాపార సంస్థలు అన్ని ఇప్పటకే కుదేలయ్యిపోయాయి.

కూలీలకు పని లేకుండా అల్లాడుపోతున్నారు.మద్యం లో కూడా దోపిడీ.అడిగిన బ్రాండ్లు ఇవ్వరు.డబ్బిస్తే వారికి నచ్చిన బ్రాండ్ ఇస్తారు.

ఆంధ్ర రాష్ట్రంలో రెండువేల రూపాయల నోట్లు కనిపించకుండా పోయాయి.ఇవన్నీ రాజకీయ నాయకుల దగ్హర దాచిపరట్టి ఉంచారు.

ఎన్నికలలో పంచడానికి.ఇరవై లక్షల ఇస్తామని చెప్పి.

కేంద్ర ప్రభుత్వం డబ్బులిచ్చి నీ ఫొటో పెట్టుకుంటావు.శ్మశానం వద్ద పేదలకు సైట్లిచ్చి కట్టుకోమంటాది ఈ ప్రభుత్వం.

ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ప్రజలకు ఇచ్చిన బియ్యం సేకరించి, పాలిష్ చేసి కాకనాడ పోర్ట్ నుంచి ఎగుమతి చేస్తున్నారు.ఈ వ్యవహారం అంతా కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేయడం లేదా.

Telugu Chandrababu, Jagan, Vijayanagaram, Vijayasai Reddy-Political

ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా మన్నారు.ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని కంపెనీలు మూసేస్తున్నారు.సాఫ్ట్ వేర్ నుంచి అండర్ వేర్ కంపెనీల వరకు అన్నీ రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి.టీచర్స్ ని ఎన్నికల విధుల నుంచి తప్పించారు వారంత ఇప్పుడు రగిలిపోతున్నారు.

రైతు నుంచి ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తామని చెప్పారు.ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో చెప్పగలరా.

చెరుకు ఫ్యాక్టరీ లు తెలిపిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.ఒక్క చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మినహా మరేదీ పనిచెయ్యడం లేదు.

ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు.పేద కుటుంబానికి నష్ట పరిహారం అయిదు లక్ష రూపాయలు మంత్రి అంబటి రాంబాబు సగం లంచం అడిగారు… ఇది ఎంత ఎగ్గుచేటు.

ధర్మాన ప్రసాద్ సిట్ దర్యాప్తులో ఎక్స్ సర్వీస్ మెన్ భూములు దోచుకున్నారని ఫిర్యాదు రాలేదా.దీనిపై మీ ముఖ్యమంత్రికి చెప్పి దర్యాప్తు చేయించో దర్మానా.

విజయ సాయి రెడ్డి విశాఖలో 45 వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రయివేటు ఆస్తులను ఆక్రమించుకున్నారు.దీనిపై బొత్సా ఎందుకు నోరు మెదపడం లేదు.కానిస్టేబుల్ బదిలీలు కూడా సుబ్బారెడ్డి, సాయిరెడ్డిల వద్దకు వెళ్లాలా.సీనియర్ లు ఉత్తరాంధ్ర మంత్రులకు సాధ్యం కాదా.

మద్యపాన నిషేధం అన్నారు.ఇరవై అయిదు సంవత్సరాల కు బ్రాందీ షాపులను తాకట్టు పెట్టింది ఈ ప్రభుత్వం.

అప్పులపై పార్లమెంట్ కి సరైన సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది.విశాఖలో కూడా ఉన్నాడు ఓ ఐటీ మంత్రి గుడివాడ అమరనాథ్.

మంత్రి పదవి చేపట్టి తొమ్మిది నెలలైనా తొమ్మిది మందికైనా ఉద్యోగం వేయించావా.పక్కన తెలంగాణాలో కేటీఆర్ ని చూడు.

ఎన్ని కంపెనీలను తీసుకొస్తున్నారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube