సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు.ఆ డైరెక్టర్లలో చాలామంది సరైన సమయం వస్తే తమ టాలెంట్ తో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటామని ఫ్యాన్స్ భావిస్తారు.
అయితే ఎంతమంది దర్శకులు ఉన్నా రాజమౌళి క్రేజ్ ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.దేశవిదేశాల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు వినిపించే స్థాయిలో జక్కన్న గుర్తింపును సొంతం చేసుకోవడం విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సంతోషంగా ఉన్నారు.
రాజమౌళి బ్రాండ్ వాల్యూతో ప్రస్తుతం ఎన్నో సినిమాలకు బిజినెస్ జరుగుతోంది.రాజమౌళి తను సక్సెస్ కావడంతో పాటు కుటుంబ సభ్యుల సహాయసహకారాలతో సినిమా సినిమాకు దర్శకునిగా తన స్థాయిని పెంచుకుంటున్నారు.
అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం మరో రాజమౌళి అవుతారని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రశాంత్ వర్మ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.
ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో దర్శకునిగా తన స్థాయిని మరింత పెంచుకునే అవకాశాలు కనిపిస్తాయి.ప్రశాంత్ వర్మ కచ్చితంగా మరో రాజమౌళి అవుతారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హనుమాన్ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమాలోని గ్రాఫిక్స్ కూడా చాలా సహజంగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ ఖాతాలో సక్సెస్ చేరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబినేషన్ గురించి సైతం చర్చ జరుగుతుండటం గమనార్హం.హనుమాన్ సినిమా సక్సెస్ సాధిస్తే ఈ కాంబోలో సినిమా తెరకెక్కే అవకాశాలు ఉంటాయి.బాలయ్య సైతం ప్రశాంత్ వర్మతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.రాజమౌళి స్థాయిలో ప్రశాంత్ వర్మ కెరీర్ పరంగా ఎదుగుతారో లేదో చూడాలి.ప్రశాంత్ వర్మ రేంజ్ పెరుగుతున్నా ఈ దర్శకుడు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.