తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. నెట్టింట్లో ట్వీట్ వైరల్!

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతుండగా పెళ్లైన సెలబ్రిటీలు తల్లిదండ్రులు అవుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా మరొక బాలీవుడ్ జంట కూడా తల్లిదండ్రులు కాబోతున్నారు.

 Gauahar Khan And Zaid Darbar Announce Their Expecting First Child Goes Viral , G-TeluguStop.com

వారు మరెవరో కాదు నటి, బాగ్‌బాస్ కంటెస్టెంట్ గౌహర్ ఖాన్.తాజాగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.

ఈ సందర్భంగా ఆ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ మేము త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం అంటూ ఆమె భర్త జైద్ దర్బార్‌ తో కలిసి ఈ విషయాన్ని వెల్లడించింది.ఈ సందర్బంగా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని కూడా పోస్ట్ చేసింది.

అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.నటి ,మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌహర్ ఖాన్, ఆమె భర్త జైద్ దర్బార్ వారి మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేశారు.ఆ వీడియోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.గౌహర్ ఖాన్, జైద్ దర్బార్ కలిసి ఇద్దరయ్యాం.ఇప్పుడు మేము త్వరలో ముగ్గురం అవుతాం.

ఈ సాహసం మరింత ముందుకు సాహసం సాగుతుంది.ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాం అని రాసుకొచ్చారు.

కాగా గౌహర్, జైద్ ల ప్రేమ కథ విషయానికి వస్తే.ఈ జంట కరోనా మహమ్మారి సమయంలో గౌహర్, జైద్ ఒక కిరాణా దుకాణంలో మొదటిసారి కలుసుకున్నారు.ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లో స్నేహితులుగా చాట్ చేసుకున్నారు.లాక్‌డౌన్ సమయంలో ఇద్దరు డేటింగ్ కొనసాగించారు.అలా కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట చివరకు డిసెంబర్ 2020లో పెళ్లి చేసుకోని ఒక్కటయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube