తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. నెట్టింట్లో ట్వీట్ వైరల్!

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతుండగా పెళ్లైన సెలబ్రిటీలు తల్లిదండ్రులు అవుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మరొక బాలీవుడ్ జంట కూడా తల్లిదండ్రులు కాబోతున్నారు.వారు మరెవరో కాదు నటి, బాగ్‌బాస్ కంటెస్టెంట్ గౌహర్ ఖాన్.

తాజాగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.ఈ సందర్భంగా ఆ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ మేము త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం అంటూ ఆమె భర్త జైద్ దర్బార్‌ తో కలిసి ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ సందర్బంగా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని కూడా పోస్ట్ చేసింది.అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నటి ,మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌహర్ ఖాన్, ఆమె భర్త జైద్ దర్బార్ వారి మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేశారు.

ఆ వీడియోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.గౌహర్ ఖాన్, జైద్ దర్బార్ కలిసి ఇద్దరయ్యాం.

ఇప్పుడు మేము త్వరలో ముగ్గురం అవుతాం.ఈ సాహసం మరింత ముందుకు సాహసం సాగుతుంది.

ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాం అని రాసుకొచ్చారు. """/"/ కాగా గౌహర్, జైద్ ల ప్రేమ కథ విషయానికి వస్తే.

ఈ జంట కరోనా మహమ్మారి సమయంలో గౌహర్, జైద్ ఒక కిరాణా దుకాణంలో మొదటిసారి కలుసుకున్నారు.

ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లో స్నేహితులుగా చాట్ చేసుకున్నారు.లాక్‌డౌన్ సమయంలో ఇద్దరు డేటింగ్ కొనసాగించారు.

అలా కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట చివరకు డిసెంబర్ 2020లో పెళ్లి చేసుకోని ఒక్కటయ్యారు.

యూకే సార్వత్రిక ఎన్నికలు .. ఓటమికి నాదే బాధ్యత, రిషి సునాక్ భావోద్వేగం