25 దేశాలతో సరిహద్దులు... 20 దేశాలతో వివాదాలు: పెచ్చుమీరుతున్న చైనా ఆగడాలు!

చైనా అనుసరిస్తున్న విస్తరణ విధానం, దురుద్దేశం కారణంగా భారతదేశంలో మాత్రమే కాకుండా అనేక ఇతర దేశాలలో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.భారత్‌తో పాటు చైనాకు.

 India Is Standing In Front Of China Details, China, India, India China Clashes,-TeluguStop.com

తైవాన్ నుంచి ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, జపాన్, నేపాల్, భూటాన్, లావోస్, హాంకాంగ్, దక్షిణ కొరియా, మకావు వరకు 20 దేశాలతో వివాదాలు ఉన్నాయి.భారత్ సహా దాదాపు 25 దేశాలతో చైనాకు సరిహద్దులు ఉన్నాయి.

భారత ఆక్రమిత టిబెట్, అక్సాయ్ చిన్‌లను చేజిక్కించుకున్న చైనా ఇప్పుడు అరుణాచల్, లడఖ్, సిక్కింలపై కూడా కన్నేసింది.అందుకే ఒకసారి డోక్లామ్‌లో, మరోసారి గాల్వాన్‌లో ఇంకొన్నిసార్లు తవాంగ్‌లో భారత సైన్యంతో చైనా ఘర్షణకు దిగింది.

భారత్‌లోని ఈ ప్రాంతాలపై శాశ్వత నియంత్రణను చేతుల్లోకి తీసుకోవాలని చైనా కోరుకుంటోంది.అయితే ఈ నేపధ్యంలో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు చిక్కులు తప్పడంలేదు.

జపాన్, చైనాల మధ్య గతకాలం నాటి శత్రుత్వం ఉంది.ఫిలిప్పీన్స్, మలేషియా, దక్షిణ కొరియాలతో కూడా చైనాకు చాలా వివాదాలు ఉన్నాయి.చైనా ఎలాగైనాసరే తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది.అమెరికాతో కూడా చైనా శత్రుత్వం పెంచుకుంటోంది.

నిజానికి ఆగ్నేయాసియాతో సహా పశ్చిమ దేశాలపై చైనా తన ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటోంది.ఈ కారణంగానే దక్షిణ చైనా సముద్రం అంతటిపైనా తన హక్కులను ప్రస్తావిస్తోంది.

ఇంతేకాకుండా హిందూ, పసిఫిక్ మహాసముద్రాలలోని చాలా ప్రాంతాలను కూడా తన ఆధిపత్యంలోకి తీసుకోవాలనుకుంటోంది.

Telugu America, China, China Foreign, Dhoklam, Galwan Valley, India, Indiachina,

చైనా వికృత చేష్టలతో భారత్‌తో సహా జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.అందుకే ఇప్పుడు అన్ని దేశాలు చైనాకు తమదైన శైలిలో సమాధానం చెప్పేందుకు వ్యూహం రచించడం మొదలుపెట్టాయి.ఇలాంటి పరిస్థితుల మధ్య చైనాకు మరింతగా కష్టాలు పెరుగుతున్నాయి.

రెండవ ప్రపంచ యుద్ధ సమయం నాటికి జపాన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం.ఈ దేశ సైన్యం అప్పట్లో చైనాలోకి ప్రవేశించింది.

అయితే జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు వేసినప్పుడు లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu America, China, China Foreign, Dhoklam, Galwan Valley, India, Indiachina,

ఈ పరిణామాలు తరువాత జపాన్ సైన్యం చైనాతో సహా ఇతర దేశాల నుండి వెనుదిరిగి వచ్చింది.ఈ నేపధ్యంలో ప్రపంచంలోని డజనుకు పైగా దేశాలు జపాన్ ఆధీనంలోకి వచ్చాయి.దీని తరువాత జపాన్ ఆధీనంలోని సముద్ర ప్రాంతాన్ని చైనా తన స్వాధీనం చేసుకుంది.

ఈ ద్వీపానికి సంబంధించి చైనా మరియు జపాన్‌ల మధ్య తరచూ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.మరోవైపు అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే తాను సూపర్ పవర్ కావాలని చైనా భావిస్తోంది.

దీని కారణంగానే ఉత్తర కొరియాతో కూడా చైనా స్నేహం మొదలుపెట్టింది.ఇదిలావుండగా ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం ముప్పును ఎదుర్కొంటన్నట్లు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube