తిరుపతి జిల్లా ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వద్ద చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి.చిరుత దాడిలో చనిపోయిన కుక్క కళేబరాన్ని వర్సిటీ సిబ్బంది గుర్తించారు.
దాదాపు పది రోజులుగా వర్సిటీ ఆవరణలో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో వర్సిటీ విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అటవీ శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.