ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.అదేవిధంగా మనీ లాండరింగ్ కేసుపై కూడా న్యాయస్థానం విచారించింది.
ఇందులో భాగంగా నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్ తో పాటు అభిషేక్ బోయినపల్లిలకు కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.అనంతరం తదుపరి విచారణను జనవరి 2 వ తేదీకి వాయిదా వేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే పలువురికి నోటీసులు అందించిన ఈడీ పలువురిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది.