స్టార్ హీరో అల్లు అర్జున్ ఏదైనా రంగంలో సక్సెస్ సాధించాలని అనుకుంటే ఆ సక్సెస్ దక్కే వరకు వదిలిపెట్టరు.సినిమా రంగంలో స్టార్ స్టేటస్ ను అందుకోవడం అల్లు అర్జున్ గంగోత్రి సినిమా నుంచి పుష్ప ది రైజ్ సినిమా వరకు బన్నీ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు.
అయితే అమీర్ పేట్ లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ కు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయ్యాయని సమాచారం అందుతోంది.
ఏషియన్ సత్యం పేరిట ఏర్పాటైన ఈ మల్టీప్లెక్స్ కోసం బన్నీ భారీ స్థాయిలో ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.2023 జనవరిలో ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ జరగనుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బన్నీ భారీ మొత్తంలో ఈ మల్టీప్లెక్స్ కోసం ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.హైదరాబాద్ లో ఇప్పటికే మహేష్ ఏఎంబీ సినిమాస్ పాపులర్ కాగా బన్నీ మల్టీప్లెక్స్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
హైదరాబాద్ లోని ప్రముఖ ఏరియాలలో అమీర్ పేట్ ఒకటి.అమీర్ పేట్ లో ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులు ఉంటారు.ఎక్కువ సంఖ్యలో జనసంచారం ఉన్న ఏరియా కావడంతో ఈ మల్టీప్లెక్స్ కు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు సంబంధించి త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారని తెలుస్తోంది.

మరోవైపు బన్నీ ప్రస్తుతం పుష్ప ది రూల్ ప్రమోషన్స్ లో భాగంగా రష్యా వెళ్లారు.బన్నీ రష్యా పర్యటన ఖర్చు ఏకంగా 5 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.బన్నీ పాన్ వరల్డ్ హీరోగా తన ఇమేజ్ ను పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.బన్నీకి రోజురోజుకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.