బాలీవుడ్ నటి రిచా ఇటీవలే ఇండియన్ ఆర్మీ ని ఉద్దేశిస్తూ గల్వాన్ హాయ్ చెబుతోంది అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.ఈ ట్వీట్ కి సంబంధించిన విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇప్పటికే రీచా పై పలువురు సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె పై మండిపడిన విషయం తెలిసిందే.టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆమె ట్వీట్ ని తప్పు పట్టిన విషయం తెలిసిందే.
అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఆమెపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.ఇది ఇలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సైతం రీచా పై సోషల్ మీడియా వేదికగా మండి పడ్డారు.
ఈ సందర్భంగా నిఖిల్ ఆమె ట్వీట్ పై స్పందిస్తూ.20 మంది భారత సైనికులు గాల్వాన్ వద్ద తమ ప్రాణాలను అర్పించారు.దేశాన్ని, మన ప్రాణాలను రక్షించారు.వారి త్యాగం గురించి వింటే ఇప్పటికీ మనకు కన్నీళ్లు వస్తాయి.రాజకీయాలను మరచి.మన సైన్యం, సాయుధ దళాలను మనం ఎల్లప్పుడూ గౌరవించాలి.
వారిని అవమానించకూడదు.రిచా దయచేసి దేశం తర్వాతే ఏదైనా తెలుసుకోండి.
అంటూ కాస్త ఘాటుగా స్పందించాడు హీరో నిఖిల్.కాగా నిఖిల్ చేసిన ట్వీట్ పై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ నిఖిల్ చేసిన ట్వీట్ ని ప్రశంసిస్తూ ఆమెపై మండిపడుతున్నారు.
రిచా కు బుద్ధి లేదు అంటూ అంత తీవ్ర స్థాయిలో అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఈ వివాదం ఎలా మొదలైంది అన్న విషయానికొస్తే.పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.వారికి సరైన సమాధానం ఇస్తాం అంటూ నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
కాగా ఆ ట్వీట్ పై రిచా స్పందిస్తూ గల్వాన్ హాయ్ చెబుతోంది అంటూ ట్వీట్ చేసింది.దీంతో ఆమె పై తీవ్రమైన విమర్శలు రావడంతో ఆమె క్షమాణపలు కూడా చెప్పింది.
ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమెపై విమర్శలు మాత్రం ఆగడం లేదు.