Shanmukh : షణ్ముఖ్ నీకు వచ్చేది ఆ ఒక్క డ్యాన్స్ స్టెప్పే.. ఎందుకింత ఓవర్ యాక్షన్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్!

యూట్యూబర్ షణ్ముఖ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకున్నాడు.అసలు ఏ టాలీవుడ్ హీరోల పేర్లు కూడా అంతా చర్చలు జరుగుతాయో లేదో తెలియదు కానీ ఈ షణ్ముఖ్ పేరు మాత్రం ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా మోత మోగింది.

 The Only Dance Step Shanmukh Gets You Why Are The Netizens Trolling Saying Its-TeluguStop.com

మొదట సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు షణ్ముఖ్.

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసి తక్కువ సమయంలో మంచి సక్సెస్ అందుకొని యూట్యూబ్ స్టార్ గా నిలిచాడు.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత పరిచయం పెంచుకున్నాడు.ఇక ఇందులో ఎంత పరిచయం పెంచుకున్నాడో అంతే నెగిటివిటీని కూడా సంపాదించుకున్నాడు.

ఈయన బిగ్ బాస్ లో చేసిన రచ్చ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఏకంగా తన మంచి జీవితానికి.చెరుగని మచ్చ ముద్రించుకున్నాడు ఈ షో ద్వారా.

అభిమానుల నుండి మాత్రం నెగటివ్ టాక్ తెచ్చుకున్నాడు.అందులో ఉన్నంతకాలం సిరి తో ఆయన ప్రవర్తించిన తీరు అందరికి బాగా కోపం తెప్పించేలా చేశాడు.

Telugu Dance Step, Netizens, Shanmukh-Movie

ఎందుకంటే అప్పటికే ఆయనకు మరో సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన తో మంచి ప్రేమ రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే.ఇక వీరిద్దరూ పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేసి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.పైగా బుల్లితెరపై ప్రసారమైన పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేశారు.కానీ షణ్ముఖ్ సిరి తో చేసిన రొమాన్స్ వల్ల.పూర్తిగా అతడికి దూరంగా ఉండటం మంచిది అని ఫిక్స్ అయింది దీప్తి.దీంతో అతడు హౌస్ నుండి బయటికి రాగానే అతడికి బ్రేకప్ చెప్పేసింది.

ఇక ఇద్దరు ఎవరి దారి వాళ్లు అన్నట్లుగా ఉన్నారు.షన్ను మాత్రం వెబ్ సిరీస్ లతో బాగా బిజీగా పరుగులు తీస్తున్నాడు.సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నాడు.ఇక ఈయన డాన్స్ కూడా బాగా చేస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే.

అప్పుడప్పుడు తన డాన్స్ కు సంబంధించిన వీడియోలు బాగా పంచుకుంటూ ఉంటాడు.తాజాగా తను ఒక డాన్స్ చేయగా ఆ వీడియోను పంచుకున్నాడు.

Telugu Dance Step, Netizens, Shanmukh-Movie

అందులో ఆయన ఒక స్టెప్పు వేయగా నెటిజెన్స్ ఆయనను బాగా ట్రోల్స్ చేస్తున్నారు.నీకు ఈ ఒక్క స్టెప్పే వస్తుందా.మరో స్టెప్పు రాదా.ప్రతి పాటకు ఇదే స్టెప్పు వేస్తావు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ఇక మరికొందరు నీకు వచ్చేదే ఆ ఒక్క స్టెప్పు.ఎందుకింత ఓవరాక్షన్ అంటూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

ఒకప్పుడు షన్ను అంటే చాలా ఇష్టపడేవాళ్లు.కానీ బిగ్బాస్ లో తాను చేసిన పని వల్ల నెగిటివ్ ను అందుకోవటంతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పూర్తిగా తగ్గింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube