తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెజీషియన్ గా,కమెడియన్ గా,యాక్టర్ గా,డాన్సర్ గా ఇలా అన్ని రంగాలలో తనదైన ముద్రను వేసుకున్నాడు.
తెలుగు బుల్లితెరపై స్టార్ హీరో రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్.ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ పేరు మారు మోగిపోతోంది.
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం గాలోడు.ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
సుడిగాలి సుదీర్ నటించిన గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా వసూళ్ల పరంగా బాగుండడమే కాకుండా సుధీర్ కి సరికొత్త ఎనర్జీ ఇస్తోంది.
ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సుడిగాలి సుధీర్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
నేపథ్యంలోని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు.ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ.గాలుడు సినిమాలో నీ కళ్ళే దివాళి అనే పాటని షూట్ చేయడం కోసం లద్దాక్ వెళ్ళాము.వెళ్ళాము.
అక్కడ భూమి కంటే 18 వేల అడుగులో ఎత్తులో ఉన్న పాంగ్యాంగ్ లేక్ దగ్గర షూట్ కోసం వెళ్ళాము.అక్కడ చాలా చల్లగా ఉంటుందని తెలిసి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా తీసుకెళ్లాము.
ఆ సమయంలో కాస్త బ్రీతింగ్ విషయంలో ఇబ్బందిగా అనిపించడంతో పూర్తిగా పైవరకు వెళ్లలేకపోయాము అని సుధీర్ చెప్పుకొచ్చాడు.
హీరోయిన్ తల్లి కూడా అలా సగం వరకు వెళ్లగానే చాలా ఇబ్బంది పడినట్టు సుధీర్ చెప్పుకొచ్చాడు.తనకు ప్రాబ్లం అయినా సరే తన కూతురు కోసం హీరోయిన్ మదర్ కూడా పై వరకు కష్టంగా వెళ్లారట.మొదటి రోజే చాలా ఇబ్బంది పడుతూ ఉండిపోయామని ఆ తర్వాత ఉదయం లేవగానే వెళ్ళిపోవాలని అనుకున్నట్లుగా తెలిపాడు.
అని నిర్మాత డబ్బులు వృధా చేయడం ఇష్టం లేక షూటింగ్ కంప్లీట్ చేసినట్టు చెప్పుకొచ్చాడు.అక్కడ మైనస్ 20,30 ఢిల్లీలో చల్లగా ఉండేదని కాళ్లు తీసి కాలు వేయలేక చాలా ఇబ్బందులు అనుభవించాము అని చెప్పుకొచ్చాడు సుధీర్.
ఆ తర్వాత డాన్స్ స్టెప్పులు వేస్తున్నప్పుడు ప్రతి షాట్ తర్వాత తనకు ముక్కులో నుంచి రక్తం కారేదని దానిని తుడుచుకుంటూ షూటింగ్ మొత్తం పూర్తి చేశాము అని చెప్పుకొచ్చాడు సుడిగాలి సుధీర్.