తెలుగు సినిమా నిర్మాతల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతుంది.నిర్మాతల మండలి లోని కొందరు నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తప్పు బడుతున్నారు.
సంక్రాంతి తో పాటు మరి కొన్ని పెద్ద పండుగల సమయం లో కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ కి నిర్మాతల మండలి ఆదేశించిన విషయం తెలిసిందే.ఇప్పుడు అదే నిర్ణయం కొందరు నిర్మాతలు తప్పుపడుతుంటే.
మరికొందరు నిర్మాత లు మాత్రం సమర్థిస్తున్నారు.ముఖ్యం గా చిన్న నిర్మాతలు సమర్థిస్తూ ఉంటే పెద్ద నిర్మాతలు మాత్రం వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నిర్మాతలకు ఈ నిర్ణయం కాస్త మింగుడు పడడం లేదు.ఆయన తో పాటు తాజాగా అశ్వినీ దత్ కూడా ఈ నిర్ణయం పై తన వ్యతిరేకతను వ్యక్తం చేశాడు.
తెలుగు సినిమా పరిశ్రమ కు చెందిన సినిమా లు ఇతర భాషల్లో విడుదల అవుతున్నాయి.
ఇలాంటి సమయం లో ఇతర భాషల సినిమా లపై తెలుగు రాష్ట్రాల్లో కండిషన్స్ పెట్టి థియేటర్స్ ఇవ్వకుంటే మన సినిమా లు అక్కడ ఆడడం.విడుదల అవ్వడం కష్టం అవుతుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇలాంటి నిర్ణయాల వల్ల సినిమాలకు అక్కడ ఇక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అశ్విని దత్ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం తెలుగు సినిమా లు అన్ని భాషల్లో భారీ ఎత్తున విడుదలవుతున్నాయి.ఇలాంటి సమయం లో మన సినిమాలను కూడా అక్కడ ఆపివేసే అవకాశం ఉంటుంది.కనుక ఇతర భాషల సినిమా లకు థియేటర్స్ ఇవ్వకూడదు అంటూ నిర్ణయం తీసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అశ్విని దత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
పలువురు నిర్మాతలు తాజా నిర్ణయం పై వ్యతిరేకత కనబరుచుతున్న నేపథ్యం లో నిర్మాతలు మండలి తమ నిర్ణయాన్ని పునః సమీక్షించుకుంటుందేమో చూడాలి.