తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న కమెడియన్లలో ప్రియదర్శి కూడా ఒకరు.
కమెడియన్ గా అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్నాడు ప్రియదర్శి.విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు.
పెళ్లిచూపులు సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.అక్క పెళ్లి చూపులు సినిమాలో నా చావు నేను చస్తా నీకెందుకు అనే డైలాగ్ తో మరింత ఫేమస్ అయ్యాడు.
ఒక్క డైలాగ్ ప్రియదర్శి రాత్రికి రాత్రి స్టార్టంలో తెచ్చుకున్నాడు.ఆ తర్వాత ప్రియదర్శి తెలుగులో ది ఘాజి ఎటాక్, అర్జున్ రెడ్డి, జై లవకుశ, జాతి రత్నాలు, రాధే శ్యామ్, సీతారామం, ఒకే ఒక జీవితం వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నటుడిగా కమెడియన్ గా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు ప్రియదర్శి.ఇది ఇలా ఉంటే ఇటీవలే ప్రియదర్శి కమెడియన్ రాహుల్ రామకృష్ణ తో కలిసి ఒక టాక్ షోలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.సినిమా ఇండస్ట్రీలో మనకు నచ్చనిది నచ్చలేదని చెప్పడం చాల కష్టమని, నో చెప్పడం కూడా ఓ కళ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రియదర్శి.
ఇప్పటి వరకు నేను నాకు తగిన పాత్రలే చేస్తూ వచ్చాను.నాకు నచ్చకపోతే సున్నితంగానే నో చెప్పేస్తా.కానీ, ఇక్కడ నో చెప్పడం పెద్ద కళనే.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మనకు నచ్చనిది నచ్చలేదు అని చెబితే వాడికి తల పొగరు అంటూ ప్రచారాలు చేస్తూ ఉంటారు.
ఇతను ఒక పెద్ద ఆర్టిస్టు ఇతనికి నచ్చాలట అంటూ ఏవేవో వార్తలను సృష్టిస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చారు ప్రియదర్శి.అందుకే ఇక్కడ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేదంటే మన ప్రమేయం లేకుండానే చాలా జరిగిపోతాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రియదర్శి.
తన విషయంలో అయితే ఒకవేళ తనకు నచ్చని సినిమాలకు నచ్చలేదని చెప్పడం ఇబ్బంది అనిపిస్తే తన మేనేజర్ హ్యాండిల్ చేస్తాడని చెప్పాడు.