బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ సినీ కెరియర్ గురించి ఆయన చిత్రపరిశ్రమలో సాధించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే.ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నార్త్ నుంచి సౌత్ వరకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ తన ఇల్లు మన్నత్ అంటే తనకు ఎంతో ప్రత్యేకమైన అభిమానం అనే విషయం మనకు తెలిసిందే.
ఎప్పటికప్పుడు ఈ ఇంటి విషయంలో ఈయన జాగ్రత్తలు తీసుకుంటూ సరికొత్త హంగులు దిద్దుతుంటారు.ఈ క్రమంలోనే ముంబై వెళ్ళిన వారు తప్పనిసరిగా మన్నత్ చూడాలని భావిస్తూ ఉంటారు.
ఇకపోతే షారుక్ ఖాన్ తన ఇంటికి మన్నత్ అనే నేమ్ ప్లేట్ తయారు చేయించిన విషయం మనకు తెలిసిందే.గతంలో ఈ నేమ్ ప్లేట్ విషయంలో వివాదం చోటు చేసుకోవడంతో షారుఖ్ ఖాన్ ఈ నేమ్ ప్లేట్ తీసేశారు.
అయితే వజ్రాలతో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ నేమ్ బోర్డులో ఒక వజ్రం మిస్ కావడంతో నేమ్ ప్లేట్ తీసేసారు.అయితే ఆ వజ్రం తన తోటలోనే పడి ఉందని తెలుసుకోవడంతో తిరిగి ఇంటిముందు మన్నత్ అనే వజ్రాల నేమ్ ప్లేట్ అతికించారు.
దీనిని చూడడం కోసం పెద్ద ఎత్తున అభిమానులు షారుక్ ఇంటి ముందుకు క్యూ కడుతున్నారు.
ఇకపోతే ఈ నేమ్ ప్లేట్ కోసం షారుఖ్ ఖాన్ భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.సుమారు 40 లక్షలకు పైగా ఈ నేమ్ బోర్డు కోసం ఖర్చు చేశారట.గతంలో తొలగించిన నేమ్ బోర్డ్ తిరిగి షారుక్ ఇంటి ముందు ఉండడంతో ఎంతోమంది అభిమానులు ఈ నేమ్ బోర్డు చూడటానికి వెళ్తున్నారని తెలుస్తోంది.
ఇక వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్‌లో షారుక్‌కు గౌరవ పురస్కారం లభించింది.
డిసెంబర్ 1 నుంచి 10వరకు జరగనున్నాయి.చిత్రపరిశ్రమకు విశేష సేవలు అందించినందుకుగాను షారుక్ ఖాన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.