చాలామంది ఆడవారు డ్రైవింగ్ చేయడంలో పొరపాట్లు చేస్తుంటారు.వారు చేసే పొరపాట్లు చూస్తే ఎవరికైనా సరే నవ్వు రాక తప్పదు.
కాగా తాజాగా ఒక మహిళ తన కారును పార్కింగ్ చేయడానికి నానా తంటాలు పడింది.చివరికి ఆ మహిళకు వేరొక మహిళ సహాయం చేసింది.
దాంతో ఎట్టకేలకు ఆమె సక్సెస్‌ఫుల్‌గా తన కారును పార్కు చేయగలిగింది.కానీ చివరి ట్విస్ట్ చూసి ఆ మహిళ నోరెళ్లబెట్టింది.
ఆమే కాదు దీనికి సంబంధించిన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇదేందయ్యా ఇది ఈ మహిళల తెలివి తెల్లారినట్లే ఉంది అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డుపక్కన రెండు కార్లు ఒకదాని వెనక మరొకటి పార్క్ చేసి ఉండటం చూడవచ్చు.
ఈ రెండిటి మధ్య చాలా స్పేస్ ఉంది.ఆ స్పేస్‌లో తన కారును పార్క్ చేయాలని ఒక మహిళ అనుకుంది.
కానీ ఆమెకు అసలు ఆ స్పేస్ లో కారు ఎలా ఉంచాలో తెలియలేదు.దాంతో చాలా ప్రయత్నించింది.
చివరికి ఆ మహిళకు మరొక మహిళ హెల్ప్ చేసింది.కారును సురక్షితంగా పార్కు చేసిన తర్వాత ఆ మహిళా డ్రైవర్ తనకు సహాయం చేసిన మహిళకు కృతజ్ఞతలు తెలిపింది.
అనంతరం సహాయం చేసిన మహిళ వెనుక ఉన్న కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది.
ఇది చూసి అవాక్కవడం సదరు మహిళవంతయింది.ఎందుకంటే ఆల్రెడీ వెనుక ఉన్న కారు తనదే అయినప్పుడు, అక్కడి నుంచి దాన్ని వేరే చోటికి డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు ఆమె హాయిగా వెళ్ళిపోవచ్చు.అప్పుడు మొదటి మహిళకు పార్కింగ్ చేయడం చాలా ఈజీ అయ్యేది.
కానీ సహాయం చేయాలనుకున్న మహిళ మాత్రం చాలాసేపు ఆమెకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ కష్టపడింది.అలానే పార్కింగ్ చేయలేని ఆ మహిళని బాగా శ్రమ పెట్టింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాగా నవ్వుకుంటున్నారు.ఆడవారు డ్రైవింగ్ చేస్తే ఇంతే ఉంటది అని కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఫన్నీ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.