Cm Kcr Kavitha : ఆ తెలంగాణ మంత్రి చుట్టూ ఈడి ఉచ్చు ? ఇరుకున్నట్టేనా ? 

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర అధికార పార్టీ బిజెపి పూర్తిగా తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.ముఖ్యంగా ఆ పార్టీలో కీలక నాయకులుగా గుర్తింపు పొందిన వారు, ఆర్థికంగా పార్టీకి అండదండలు అందిస్తున్న వారిని గుర్తించి వారిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది.

 Edi Trap Around That Telangana Minister Is It The Same ,telangana, Ed, Mallared-TeluguStop.com

దీనిలో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి.టిఆర్ఎస్ లో కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన మంత్రులను టార్గెట్ చేసుకుని వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అర్థమవుతుంది.

ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెరపైకి తెచ్చారు.అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కేసినో వ్యవహారంలో మారుమోగుతుండగా, మంత్రి మల్లారెడ్డి ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ఈడి రంగంలోకి దిగింది.

మంత్రి మల్లారెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థలు,  వారి బంధువుల ఇళ్ళ  పై ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.దాదాపు 50 బృందాలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.మల్లారెడ్డి అపర కుబేరుడు.ఆయనకు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు,  మెడికల్ కాలేజీలతో పాటు,  అనేక వ్యాపార వ్యవహారాలు ఉన్నాయి.

దీంతో పాటు ఆయనపై అనేక భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి.గతంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈడి ,ఐటి అధికారులకు ఫిర్యాదు చేశారు.
 

Telugu Directaret, Kavitha, Malla, Telangana, Telangana Cm, Trs Malla-Political

కానీ ఆ సమయంలో టిఆర్ఎస్, బిజెపి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో మల్లారెడ్డి విషయాన్ని పక్కన పెట్టారు.కానీ ఇప్పుడు బిజెపి , టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో పోరు నెలకొన్న నేపథ్యంలో,  టిఆర్ఎస్ కు ఆర్థికంగా అండదండలు అందిస్తూ వస్తున్న మల్లారెడ్డిని ఇరుకును పెట్టడం ద్వారా రాబోయే ఎన్నికల్లో కొంతమేరకైనా టిఆర్ఎస్ ను దెబ్బ కొట్టవచ్చు అనే వ్యూహంతో ఈడి ని రంగంలోకి దింపినట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube