NTR Shavukar Janaki: ఎన్టీఆర్ ని హర్ట్ చేసిన హీరోయిన్, మళ్లి ఆమెతో కలిసి నటించలేదు

సినిమా అంటే ఇప్పుడు కథ ఎలా ఉన్న కంటెంట్ ఎలా ఉన్న కేవలం హీరోయిన్ తో రొమాన్స్ లేదంటే ఎక్సపోసింగ్ తో లాగించేస్తున్నారు.కానీ మరి నాటి రోజుల్లో పరిస్థితి ఇలా ఉండేది కాదు.

 Ntr Hurt About Shavukar Janaki Details, Ntr , Shavukar Janaki, Ntr Shavukar Jana-TeluguStop.com

కథ తో పాటు కంటెంట్ మరియు నటన బాగుంటేనే సినిమా ఆడుతుంది.హీరోలకు ఎలాగూ మంచి స్కోప్ ఉంటుంది కానీ హీరోయిన్స్ మాత్రం అద్భుతంగా నటిస్తేనే సినిమాలు నిలబడేవి.

కొన్ని సార్లు అందం లేకపోయినా కేవలం నటన తోనే లాగేవారు.ఆలా చాల మంది హీరోయిన్స్ నాటి రోజుల్లో పెద్ద అందగత్తెలు కాకపోయినా సినిమాల్లో రాణించారు.

దాంతో అప్పట్లో నిర్మాతలు, దర్శకుడు హీరో హీరోయిన్ల ఎంపికలో చాల జాగ్రత్తగా ఉండేవారు.

ఇక కొన్ని సార్లు ఇలా ఎంపిక చేసిన కాంబినేషన్స్ ఒక్కో సారి హిట్ అయినా, కొన్ని సార్లు ఫ్లాప్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి.

ఆలా సీనియర్ ఎన్టీఆర్ – షావుకారు జానకి విషయంలో కూడా ఇలాగే జరిగింది.ఎన్టీఆర్ అంటే అప్పట్లో బాగా సావిత్రి మాత్రమే గుర్తస్తుంది.కానీ షావుకారు సినిమాలో ఎన్టీఆర్ సినిమాలో జానకిని హీరోయిన్ గా తీసుకున్నారు.ఈ సినిమాలో జానకి కి మంచి పేరు వచ్చింది.

ఆ సినిమానే ఆమె ఇంటి పేరుగా కూడా మారిపోయింది.కానీ ఎన్టీఆర్ కి మాత్రం అంత పేరు రాలేదు.

అయన ఒక డమ్మీ పాత్రలో నటించాడు అని అంత అనుకున్నారు.ఈ విషయం లో అప్పట్లో ఎన్టీఆర్ కాస్త హర్ట్ అయ్యారట.

Telugu Kanyashulkam, Nandamuritaraka, Ntrshavukar, Savitri, Shavukar Janaki, Sha

ఇక ఆ ఆతర్వాత వీరిద్దరూ కలిసి మళ్లి హీరో హీరోయిన్స్ గా నటించలేదు.కన్యాశుల్కం లో నటించిన అందులో జానకి కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటించింది.ఈ చిత్రంలో సావిత్రికి ఎక్కువ ప్రాధాన్యత దొరికింది.జానకి తో హీరోయిన్ గా సినిమా అంటే మళ్లి ఎన్టీఆర్ ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు.ఆ తర్వాత ఆమెకు తెలుగు లో ఎక్కువ హీరోయిన్ గా అవకాశాలు కూడా రాలేదు.తమిళం వైపు వెళ్ళిపోయి అక్కడ హీరోయిన్ గా చేస్తూ ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

ఇలా షావుకారు జానకి తో ఎన్టీఆర్ మళ్లి నటించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube