సింగర్ సునీత సినిమాల్లో నటిస్తే ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తారని చాలామంది సూచనలు చేసినా ఆమె మాత్రం సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు.డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సునీత తన కొడుకును సినిమాల్లో హీరోగా పరిచయం చేయనున్నారని తెలుస్తోంది.
సునీత చేసిన కామెంట్ల ద్వారా ఇందుకు సంబంధించి క్లారిటీ వచ్చింది.
సునీత కుటుంబ సభ్యులు ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
సునీత కొడుకు సినిమాల్లో హీరోగా నిలద్రొక్కుకుంటారో లేదో చూడాల్సి ఉంది.చాలామంది సెలబ్రిటీల కొడుకులు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు.
అయితే సునీత కుటుంబానికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉండటంతో సునీత కొడుకు తొలి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
సునీత కొడుకులో హీరోకు అవసరమైన లక్షణాలన్నీ ఉండటంతో అతను హీరోగా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని
మరి కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సునీత నాలుగు పదుల వయస్సులో కూడా యంగ్ జనరేషన్ సింగర్లకు, డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు గట్టి పోటీ ఇస్తుండటం గమనార్హం.కొడుకు కెరీర్ విషయంలో సక్సెస్ అయ్యేలా సునీత అడుగులు వేస్తున్నారు.
తాజాగా సునీత కొడుకు ఆకాష్ పుట్టినరోజు జరగగా నిన్ను త్వరలో నటుడిగా చూడాలని అనుకుంటున్నానని సునీత పేర్కొన్నారు.సోషల్ మీడియాలో సునీతకు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా సునీత వాయిస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.సునీత రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.