అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన సిక్కు మహిళ చరిత్ర సృష్టించారు.బేకర్స్‌ఫీల్డ్‌కు చెందిన డాక్టర్ జస్మీత్ కౌర్ బెయిన్స్ కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి సిక్కు మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కారు.కెర్న్ కౌంటీలోని 35వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్ నుంచి బరిలోకి దిగిన డాక్టర్ జస్మీత్ కౌర్.
తన ప్రత్యర్ధి లెటిసియా పెరెజ్‌పై ఆధిక్యం సాధించారు.వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.జస్మీత్‌కు 10,827 ఓట్లు (58.9శాతం).పెరెజ్ 7,555 ఓట్లు (41.1 శాతం) సాధించారు.
బేకర్స్ ఫీల్డ్ రికవరీ సర్వీసెస్‌లో ఆమె మెడికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.వ్యసనానికి బానిసలైన వారికి ఈ సంస్థ చికిత్స, సేవను అందిస్తుంది.తన ప్రచారంలో భాగంగా ఆరోగ్య సంరక్షణ, నిరాశ్రయత, నీటి సదుపాయాలు, గాలి నాణ్యతకు తొలి ప్రాధాన్యత ఇస్తానని జస్మీత్ హామీ ఇచ్చారు.తాను పెరిగిన నార్త్ కెర్న్ కౌంటీలోని డెలానోలోని టోనీస్ ఫైర్‌హౌస్ గ్రిల్, పిజ్జా రెస్టారెంట్‌లలో దాదాపు 100 మంది కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మద్ధతుదారులతో కలిసి జస్మీత్ ఎన్నికల ఫలితాలను వీక్షించారు.
ఇకపోతే.35వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్ అర్విన్ నుంచి డెలానో వరకు విస్తరించి వుంది.ఈస్ట్ బేకర్స్‌ఫీల్డ్‌లో ఇది ఎక్కువగా వుంది.జస్మీత్ తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చారు.ఆటోమెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆమె తండ్రికి కార్ డీలర్‌షిప్‌లు వున్నాయి.కళాశాల విద్య తర్వాత.
డాక్టర్ కావడానికి ముందు జస్మీత్ తన తండ్రితో కలిసి వ్యాపారం చూసుకున్నారు.కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వున్నప్పుడు రోగులకు సేవ చేసేందుకు ఫీల్డ్ హాస్పిటల్ సైట్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా జస్మీత్ మన్ననలు పొందారు.
ఆమెకు కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ నుంచి 2019 ఏడాదికి గాను ‘హీరో ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అవార్డ్… గ్రేటర్ బేకర్స్‌ఫీల్డ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి 2021 సంవత్సరానికి గాను బ్యూటిఫుల్ బేకర్స్‌ఫీల్డ్ అవార్డు లభించింది.