కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీ బుడుగుల లింగయ్య యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈనెల 12న తెలంగాణలోని రామగుండంలో ప్రధాని మోదీ పర్యటన ఉందన్నారు.
కానీ బీజేపీ ప్రభుత్వం కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు.ప్రధాని టూర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించలేదని విమర్శించారు.
తెలంగాణపై కేంద్రం పగ పట్టిందన్నారు.రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ కక్ష పూరితంగా వ్యవహారిస్తుందని ఆరోపించారు.