కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి

సూర్యాపేట జిల్లా:గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమ నిర్మాత కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 38వ వర్ధంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.

 Death Anniversary Of Comrade Chandra Pullareddy-TeluguStop.com

డేవిడ్ కుమార్ అమరవీరుల స్తూపం వద్ద అరుణపతాకాన్ని ఎగురవేయగా, సీపీ రెడ్డి,జెన్ను సార్ చిత్రపటాలకు పీఓడబ్ల్యూ నాయకురాలు కళమ్మా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నత చదువులు ఒదులుకొని,పీడిత ప్రజల కోసం,దున్నే వానికి భూమి కావాలని,కమ్యునిస్టు రాజ్యం కోసం చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడిన యోధుడు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి అని కొనియాడారు.దేశంలో విప్లవోద్యమాన్ని విస్తరింపచేయడంలో,ముఖ్యంగా గోదావరి లోయ రైతాంగ ప్రతిఘటన పోరాటాలను నిర్మాణం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడని గుర్తు చేశారు.మార్క్సిజం,లెనినిజం,మావో ఆలోచనల మూల సూత్రాలను ఈ దేశ పరిస్థితులకు అన్వయింప చేశారన్నారు.

విప్లవోద్యమంలో దేశంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు విశ్లేషించి కర్తవ్యాలను రూపొందించారన్నారు.కమ్యునిస్టు ఉద్యమంలో వచ్చిన అతి,మిత వాదాలకు వ్యతిరేకంగా తన వాదనలను బలంగా వినిపించారని, ఉద్యమ ఆచరణలో తప్పులను గ్రహించి,గుణపాఠాలు నేర్చుకొని పార్టీ క్యాడర్ ను చైతన్యవంతులుగా చేయడంలో ముఖ్యపాత్ర వహించారన్నారు.

అయిన ఆశయాల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఏఐకెఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్,పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కునుకుంట్ల సైదులు,ఐఎఫ్టీయు జిల్లా ఉపాద్యక్షులు కారింగుల వెంకన్న,ఎస్.

కె సయ్యద్,సామ నర్సిరెడ్డి,అరుణోదయ జిల్లా నాయకులు బోల్లే వెంకన్న, అశోక్ రెడ్డి,విరాబోయిన రమేష్,పోదిల్ల దుర్గయ్య,భీంరెడ్డి, జయరాజు,దండి ప్రవీణ్,శ్రీధర్,ఒగ్గు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube