Samantha Suma : సమంతతో ఆ విషయాల గురించి మాట్లాడి ఉండకూడదు.. సుమపై ట్రోలింగ్?

టాలీవుడ్ యాంకర్ సుమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ గా మంచి పేరు సంపాందించుకుంది.

 Shouldnt Have Talked About Those Things With Samantha Trolling On Suma ,samantha-TeluguStop.com

స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ యాంకర్ సుమ సంపాదించుకుంది.ఇక ఈమెకు ఉన్న క్రేజ్ తోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకొని ఒక లెవెల్ లో దూసుకెళ్తుంది.

ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు సంపాందించుకుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

కేవలం ఎంటర్టైన్మెంట్ షోలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ హోస్టింగ్ చేస్తూ తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో బాగా బిజీగా ఉంది.

ఈమె మాటలు వింటే మాత్రం ప్రేక్షకులతో పాటు సెలబ్రేటీలు కూడా కరగాల్సిందే.తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.

పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్ యాంకర్.

స్టార్ నటీనటుల నైనా సరే సుమ తన మాటలతో బాగా ఎంటర్టైన్ చేస్తుంది.సుమ భవిష్యత్ తరాల వారికి కూడా తన యాంకరింగ్ చూపించే సత్తా తన లో ఉంది అని చెప్పవచ్చు.

ఇక సుమ షో కి ఎవరైనా వస్తే చాలు తన పంచులతోనే కాకుండా తన ప్రశ్నలతో కూడా వారిని ఇరకాటంలో పెడుతోంది.ఇక ఇప్పటివరకు సుమ ఎటువంటి నెగటివీటిని మోయలేదు.

Telugu Hari, Harish, Pre Relese, Samantha, Suma, Yashoda-Movie

సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన ఇన్ స్టా ఖాతాలో కూడా బాగా ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది.

Telugu Hari, Harish, Pre Relese, Samantha, Suma, Yashoda-Movie

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా సుమ పై ట్రోలింగ్స్ ఎదురవుతున్నాయి.ఇంతకు అసలు విషయం ఏంటంటే.సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.అంతలోనే తను నటించిన యశోద సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ భాగంలో సుమ సమంతను ఇంటర్వ్యూ చేసింది.దీంతో సమంత అందులో బాగా ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.

ఇక సమంత మాట్లాడిన మాటలన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.అయితే సమంత మాట్లాడిన మాటలన్నీ మరోలా అర్థం చేసుకొని కొన్ని వెబ్సైట్లు మరోలా థంబ్ నైల్స్ పెట్టి లేనిపోని వార్తలు క్రియేట్ చేసి తనను మరింత బాధ పెట్టేలా చేస్తున్నారు.

దీంతో యాంకర్ సుమ పై కూడా బాగా ట్రోల్స్ చేస్తున్నారు.సుమ కొన్ని అంశాలు గురించి చర్చలు చేయటంతో.

సుమ అలా చేయడం కరెక్ట్ కాదు అంటూ.ప్రస్తుతం సమంత అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేయటమే తప్పు అని.అలాంటిది తన పట్ల అలా ఇంటర్వ్యూ చేసి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ సుమపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube