మన్యం జిల్లా పార్వతీపురంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.పనుకువలస దగ్గర గజరాజుల గుంపు సంచరిస్తుంది.
ఈ క్రమంలో పొలంలో పని చేసుకుంటున్న ఇద్దరు రైతులపై ఏనుగుల గుంపు దాడి చేసింది.గజరాజుల దాడిలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు.ఇది వరకు పంట పొలాలను మాత్రమే నాశనం చేసేవాని, ఇప్పుడు ప్రజలపై కూడా దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగుల గుంపు నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.