Rajnikanth NTR: ఇంత మంది స్టార్ హీరోలు ఉండగా ఎందుకు రజినీ, తారక్ లను మాత్రమే కన్నడ ఓన్ చేసుకుంది ?

కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న పురస్కారం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.అయన తరపున పునీత్ సతీమణి అశ్విని ఈ అవార్డు అనుకున్నారు.

 Why Karnataka Gave Importance To Rajinikanth And Tarak Details, Jr Ntr, Rajnikan-TeluguStop.com

ఓ వైపు జోరున వర్షం, మరోవైపు పునీత్ కుటుంబం మరియు అభిమానులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.ఆ రాష్ట్రంలో ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డు.

అలాగే పునీత్ తండ్రి కి కూడా ఈ అవార్డు దక్కింది.ఇక ఇదంతా కూడా మనం నిన్న మొన్న వార్తల్లో చూసాం.

అయితే కన్నడ సినిమా పరిశ్రమ నుంచి, అలాగే ఇతర బాషల నుంచి పునీత్ కి సన్నిహితంగా ఉండే ఎంతో మంది హీరోలు ఉన్నారు.

అయినా కూడా కేవలం తమిళం నుంచి రజినీకాంత్ ని, తెలుగు నుంచి జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రమే ఈ అవార్డుల ప్రదానోత్సవం లో ముఖ్య అతిధులుగా పిలిచారు.

ఇక్కడే ఒక లాజిక్ ఉంది.ఈ ఇద్దరు హీరోలను కన్నడ సినిమ పరిశ్రమ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకుంది.అందుకు గల కారణం ఈ ఇద్దరు హీరోలకు కన్నడ భాషతో ముడి పడి ఉన్న బంధం.రజనీకాంత్ కన్నడ వ్యక్తి.

అక్కడ బస్సు కండక్టర్ గా పని చేసాడు.చెన్నై కి వెళ్లి సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకోని మకాం మద్రాసుకు మార్చాడు.

అక్కడ సూపర్ స్టార్ అయ్యాడు.అంటే రజినీకాంత్ ఒక్క తమిళ్, కన్నడ అని విడదీయడం కూడా కరెక్ట్ కాదు.

అతడు దేశానికి ఆస్థి లాంటి వాడు.

Telugu Jr Ntr, Kannada, Karnataka, Karnatakaratna, Rajinikanth, Rajnikanth-Movie

ఇక తారక్ లాంటి యువ హీరోను కర్ణాటక రాష్ట్రం ఓన్ చేసుకోవడం వెనక కూడా రజిని లాంటి బాషా సెంటిమెంట్ ఉంది.తారక్ తల్లి షాలిని కన్నడ కావడం తో తారక్ మదర్ టంగ్ కన్నడ అవుతుంది.మ్యూజిక్ టీచర్ గా హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే హరికృష్ణ తో సెటిల్ అయ్యింది.

ఆలా చూసుకుంటే ఈ ఇద్దరు హీరోలు కన్నడ భాషతో సంబంధం ఉన్నవారు కాబట్టి అక్కడ వారు తారక్ ని, రజినీకాంత్ ని ఓన్ చేసుకుంటున్నారు.కన్నడ మూలాలు ఉన్న ఈ ఇద్దరు హీరోలు తమ వారు అనుకోవడమే ఇందుకు గల ముఖ్య కారణం.

మరోవైపు మొన్నటికి మొన్న రిషబ్ శెట్టి మా వాడు అందుకే నాకు ఫెవరెట్ హీరో అంటూ తమ భాషాభిమానాన్ని బయట పెట్టుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube