ఫిన్‌టెక్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్ రంగాలలో విస్తారమైన అవకాశాల నేపథ్యంలో భారతీయులకు హాంకాంగ్ కొత్త వీసా స్కీమ్ నుంచి ప్రయోజనం కలగనుంది.అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రం హొదాను కోల్పోయే ప్రమాదం వున్న నేపథ్యంలో నష్ట నివారణా చర్యల్లో భాగంగా హాంకాంగ్ ఈ చర్యలు చేపట్టింది.
గత రెండేళ్లుగా నగరంలో శ్రామిక శక్తి బాగా పడిపోయింది.దీంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ.ఈ నెలలో ‘టాప్ టాలెంట్ పాస్ స్కీమ్’ను ప్రకటించారు.ఇందులో అధిక సంపాదన వున్నవారికి , ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది.
ఈ పథకం ద్వారా ఏడాదికి 3,18,000 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ సంపాదించని వారికి , గడిచిన ఐదేళ్లలో మూడేళ్ల పని అనుభవం వున్న ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్‌లకు రెండేళ్ల వీసాను మంజూరు చేస్తారు.
ఇకపోతే.
హాంకాంగ్‌లో 42,000కు పైగా భారతీయులు వున్నారు.వీరిలో దాదాపు 33,000 మంది భారతీయ పాస్‌పోర్టులను కలిగి వున్నారని హాంకాంగ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో పేర్కొంది.
సేవా రంగం, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, షిప్పింగ్ తదితర రంగాల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులు పెద్ద సంఖ్యలో హాంకాంగ్‌కు వలస వస్తున్నారని వెబ్‌సైట్ పేర్కొంది.హాంకాంగ్ సాధారణ ఉపాధి విధానం – 2021 ప్రకారం భారతీయుల నుంచి 1,034 వీసా దరఖాస్తులకు గాను.
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 560 దరఖాస్తులకు ఆమోదం పొందింది.కోవిడ్‌కు ముందు .అదే సాధారణ ఉపాధి విధానం ప్రకారం 2019లో భారతీయ పౌరులకు 2,684 వీసాలు జారీ చేయబడ్డాయి.

ఇదిలావుండగా.హాంకాంగ్ 150 ఏళ్లకు పైగా భారతీయ కమ్యూనిటీకి నిలయంగా వుంది.సింధ్, గుజరాత్, పంజాబ్‌లకు చెందిన ప్రజలు ఇక్కడ పెద్ద సంఖ్యలో స్ధిరపడ్డారు.
హాంకాంగ్‌లో 40కి పైగా భారతీయ సంఘాలు వున్నాయి.వీటిని డయాస్పోరా, భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు నిర్వహిస్తున్నారు.
గ్లోబల్ ఫైనాన్స్, వర్తక కేంద్రంగా నగరం ఆవిర్భవించడంలో భారతీయులు కీలక పాత్ర పోషించారు.భారతదేశానికి చెందిన ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులు, రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు హాంకాంగ్‌లో పనిచేస్తున్నాయి.
హాంకాంగ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకారం.భారత్‌లో పనిచేస్తున్న అనేక గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజాలు, పెట్టుబడి సంస్థలు, ఫండ్ మేనేజర్‌లు తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను హాంకాంగ్‌లో కలిగి వున్నాయి.
అలాగే హాంకాంగ్.భారతీయ కంపెనీలకు ప్రధాన సోర్సింగ్ కేంద్రంగానూ వ్యవహరిస్తోంది.