బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి

యాదాద్రి జిల్లా:మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రత్యర్థుల పరస్పర ఆరోపణలు,మాటల యుద్ధాలు ఎప్పుడో శ్రుతి మించాయి.ఇక ప్రచారం పతాక స్థాయికి చేరుతున్న తరుణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మద్యం, డబ్బుతో పాటు రకరకాల రూపాల్లో బహుమతుల ప్రలోభాలకు తెరతీశారు.

 Tomb Of Bjp National President Jp Nadda-TeluguStop.com

ఇదిలా ఉంటే గురువారం చౌటుప్పల్ మండలం దండుమల్కపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి సమాధి కట్టి,దానిపై ఆయన ప్లెక్సీ పెట్టడం కలకలం రేపింది.జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ రీజినల్ ప్లోరైడ్ మిటిగేషన్&రీసెర్చ్ సెంటర్ కోసం ప్రభుత్వ భూమి అలాట్మెంట్ చేయాలని సూచించారు.

కానీ,రాష్ట్ర ప్రభుత్వం భూ అలాట్మెంట్ చేయకుండా,మిషన్ భగీరథతో ప్లోరైడ్ లేకుండా చేశామని ఆ ప్రాజెక్ట్ అవసరం లేదని లేఖ రాసింది.దీనితో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

అయితే జేపీ నడ్డా ప్రాజెక్ట్ ఇవ్వలేదనే ఉద్దేశ్యంతో ఈ సమాధి కట్టినట్లు ప్లెక్సీపై రాసిన రాతలను బట్టి అర్ధమవుతుంది.గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ పనికి గ్రామంలో ఒక్కసారిగా వాతారవణం వేడెక్కింది.

దీనిపై స్థానిక బీజేపీ నేతలు కార్యకర్తలు భగ్గున మండిపడుతున్నారు.చౌటుప్పల్ రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్ట్ వద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, విషయ పరిజ్ఞానం లేకుండా దండుమల్కాపురం ఇంచార్జీగా టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేయించిన పనిగా భావిస్తున్నామన్నారు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దండుమల్కాపురంలో రౌడియిజం చేస్తూ బీజేపీ శ్రేణులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని,ఆయన అరాచకాలు ఆపకుంటే బీజేపీ కార్యకర్తలు తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు.ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించామని,బీజేపీ పైస్థాయి నాయకులకు సమాచారం ఇచ్చామని,దానిపై జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంతుందని తెలిపారు.

రాజకీయాలు చేసేటప్పుడు నైతిక విలువలు కూడా కాపాడాలని,ఇలాంటి సంఘటనలకు పాల్పడడం దుర్మార్గమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube