తమిళ హీరోలు కార్తి, శివ కార్తికేయన్ ఇద్దరు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు.ఇందులో విశేషం ఏముంది అనుకోవచ్చు.
ఇద్దరు తమ సినిమాలతో తమిళంలో పోటీ పడితే అది కామనే కానీ వాళ్లిద్దరు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫైట్ కి దిగుతున్నారు.శివ కార్తికేయన్ ప్రిన్స్ మూవీతో వస్తుండగా.
కార్తి సర్ధార్ సినిమాతో వస్తున్నాడు.ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ ఏర్పడింది.
జాతిరత్నాలు అనుదీప్ కెవి డైరక్షన్ లో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ప్రిన్స్ ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుంది.
ఈ సినిమాకు శివ కార్తికేయన్ కామెడీ హైలెట్ అంటున్నారు.
ఇక ఇదేక్రమంలో కార్తి సర్ధార్ మూవీ కూడా ఇండియన్ స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తుంది.కార్తి ఈ సినిమాపై చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.
పి.ఎస్ మిత్రన్ డైరక్షన్ లో తెరకెక్కిన సర్ధార్ తెలుగు లో కూడా బజ్ ఏర్పరచుకుంది.ఇదే కాకుండా తెలుగు హీరోలు మంచు విష్ణు జిన్నాతో.విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమాలతో శుక్రవారం వస్తున్నారు మరి ఈ నాలుగు సినిమాల ఫైట్ లో ఏ సినిమా విజయ పతాకాన్ని ఎగురవేస్తుందో చూడాలి.