శ్రీనిధి, అనుపమ పేర్లు చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి.. ఏం జరిగిందంటే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచే వినిపిస్తున్న వార్త తెలుగు హీరోయిన్ లకు టాలీవుడ్ లో అవకాశాలు తక్కువ అని.మొదటి సారి హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పటికీ రెండవసారి నుంచి ఆమెకు రెండవ హీరోయిన్ సైడ్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు.

 Actress Rekha Boj Sensational Comments On Telugu Heroines Tollywood Directors Re-TeluguStop.com

ఇది మన అందరికీ తెలిసిన నగ్న సత్యం.ఇదే విషయంపై తెలుగు హీరోయిన్లు స్పందించిన విషయం తెలిసిందే.

తాజాగా ఇదే విషయంపై మరొక నటి కూడా స్పందించింది.ఆమె మరెవరో కాదు తెలుగు నటి రేఖా భోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మన దర్శకులు ఆ విషయం చూసి బుద్ధి తెచ్చుకోవాలని అంటూ ఆమె చురకలు అంటించింది.ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ ని రాసుకొచ్చింది.

కేజీఎఫ్, కాంతార లాంటి సినిమాలలో హీరోయిన్స్ గా శ్రీ నిధి శెట్టి, సప్తమి గౌడ లాంటి కన్నడ అమ్మాయిలనే పెట్టుకుని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు.ఇది చూసి అయినా మన తెలుగు దర్శకులు కాస్త బుద్ధి తెచ్చుకోవాలి.

ఈ సినిమాలతో పాటుగా.రంగితరంగ, ముంగారుమలై, దునియా, కిరాక్ పార్టీ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి.

కార్తికేయ 2 లో ఆ మలయాళీ కాకుండా తెలుగు అమ్మాయి ఉన్నా ఆ సినిమా కూడా అలాగే ఆడుతోంది.మన సబ్జెక్ట్ లో అండ్ మన గు**లో దమ్ము ఉండాలే కానీ, ఆ నార్త్, మలయాళీ, కన్నడ అమ్మాయిలు వచ్చి ఇక్కడ చేసేది ఏం ఉండదు .డైలాగ్స్ చెప్పమంటే జీరో ఎక్స్ ప్రెషన్స్ తో అప్పడాలు, ఒడియాలు నమిలినా కూడా మన డైరెక్టర్ కి వాళ్లే కావాలి.మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే రాజ్ తరుణ్, కార్తికేయ, విష్వక్ సేన్ లాంటి హీరోల సినిమాలలో కూడా తెలుగు హీరోయిన్లకు అవకాశాలు లేవు.

అలాగే కిరణ్ అబ్బవరం, శ్రీ సింహ, సంతోష్ శోభన్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్ల పక్కన కూడా మన తెలుగు అమ్మాయిలు లేరు.అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలో వాళ్లు ఆ నేటివిటీకి తగినట్లు అదే లాంగ్వేజ్ అమ్మాయిలని తీసుకుంటారు.బట్ అదే సినిమాని మనవాళ్ళు రీమేక్ చేసినప్పుడు మాత్రం మన నేటివిటీకి తెలుగు అమ్మాయిలను కాకుండా వేరే వాళ్ళను పెడతారు.అక్కడ సైడ్ యాక్టర్స్ అయిన నారప్ప, మాస్టర్ మూవీల అమ్మాయిలను మనవాళ్ళు హీరోయిన్లుగా చేసేశారు.

వాళ్లు వాళ్ళ లాంగ్వేజ్ లోనే హీరోయిన్స్ కాదు అసలు.చివరికి అందరూ అసలు సినిమాల కిందే లెక్కచేయని మా వైజాగ్ ఫిల్మ్స్ లో కూడా తెలుగు అమ్మాయిలకు స్థానం లేదు.

ఇది మన తెలుగు సినిమాకి పట్టిన కర్మ, దరిద్రం అని రేఖా భోజ్ సుధీర్ఘంగా రాసుకొచ్చింది.ఆమె చేసిన వాఖ్యలు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.

కాగా ఆమె పోస్ట్ పై స్పందించిన పలువురు సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగాకామెంట్స్ చేస్తున్నారు.మరి రేఖ బోజ్ బాధని అర్థం చేసుకున్న తెలుగు దర్శకులు ఇకమీదట అయినా తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube