ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్.. అలా ఫిక్స్ అయ్యారు?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

 Vijay Deverakondas Next Film Is Fixed With This Director Gautam Tinnanuri Detail-TeluguStop.com

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి,గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇకపోతే విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్.

భారీ అంచనాలను నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అని అభిమానులు అందరూ అనుకున్నారు.

కానీ ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండకు భారీగా నెగెటివిటీ ఏర్పడింది.ఇంత కొద్ది రోజులు విజయ్ దేవరకొండ పై భారీ ఎత్తున ట్రోలింగ్స్ ను చేశారు నెటిజన్స్.

అటు చిత్ర బృందానికి కూడా ఈ సినిమా భారీగా నష్టాన్ని మిగిల్చింది.అయినప్పటికీ విజయ్ దేవరకొండ ఏమాత్రం నిరాశ చెందకుండా తన తదుపరి సినిమా అయిన ఖుషి సినిమా షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాతో ఎలా అయినా సూపర్ హిట్ సాధించాలి అనే విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు.కానీ ఈ సినిమా మాత్రం అంతకంతకు ఆలస్యం అవుతూనే ఉంది.సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుండడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది.

Telugu Kushi, Liger, Project, Tollywood-Movie

అయితే ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ కి సంబంధించిన సన్నివేశాలు అన్నీ పూర్తి అయ్యాయి.దీంతో సమంత రాక కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ ఈ గ్యాప్ లో మరొక సినిమాను ఓకే చేసే పనిలో పడ్డాడు.ఖాళీగా ఉంటుండడంతో స్క్రిప్ట్ లను వింటున్నాడు విజయ్.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.అదేమిటంటే విజయ్ దేవరకొండ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట.

Telugu Kushi, Liger, Project, Tollywood-Movie

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండకు ఓ లైన్‌ను వినిపించడంతో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లా ఉండేలా కథను డిజైన్ చేస్తానని చెప్పాడట.అతడు చెప్పిన లైన్‌కు విజయ్ ఫిదా అయ్యి పూర్తి స్క్రిఫ్ట్‌ను సిద్ధం చేయమని కోరాడట.పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసిన తర్వాత వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడట విజయ్.ఆలోపు ఖుషి సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడట విజయ్.

తన విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నానురి సినిమాను ఎన్వి ప్రసాద్ నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube